31.7 C
Hyderabad
May 2, 2024 07: 57 AM
Slider కడప

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ కు ఫిర్యాదు చేసిన బిజెపి నేతలు

#nationalcouncil

అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుపోయిన ఘటనలో భాధితులకు న్యాయం చెయ్యాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ కు బిజెపి నేతలు నాగోతు రమేష్ నాయుడు, రఘు, భాస్కర్ ఫిర్యాదు చేశారు. 60 రోజులలో ఇళ్లు కట్టిస్తా మన్న హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదని, రైతుల పంట పొలాల్ని సాగుకు ఆమోదయోగ్యంగా మార్చుతామన్న హామీని నిలబెట్టు కోలేదని ఆరోపించారు.

దీనివల్ల ఇప్పటి వరకు మూడు పంటలు నష్టపోయారని, ప్రాజెక్ట్ ప్రమాదానికి కారకులయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులు తమ పంట పొలాలపై తీసుకున్న రుణాలను మాఫీ చెయ్యాలని, సీఎం సొంత జిల్లాలో ఇసుక మాఫీయా వల్ల జరిగిన ఘటన పై ఇప్పటి వరకు సమగ్ర దర్యాప్తు జరగలేదని, కేసులు నమోదు చెయ్యలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ సభ్యుడు జ్ఞానేశ్వర్ ముల్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరతామని వారికి హామీ ఇచ్చారు.

Related posts

హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం

Satyam NEWS

భద్రాద్రి జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

వైసీపీ పార్టీకి చెందిన గూండాలపై రౌడీషీట్ తెరవాలి

Satyam NEWS

Leave a Comment