అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరుగుతున్న 67వ జాతీయస్థాయి అండర్ 14 బాలికల కబడ్డీ పోటీలలో హర్యానా జట్టు విజేతగా నిలిచి జాతీయ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసు కుంది. అదేవిధంగా ప్రత్యర్లైన రాజస్థాన్ జట్టు కేవలం అతి తక్కువ పాయిం ట్లతో రెండవ స్థానం సాధించింది. అలాగే మూడు నాలుగు స్థానాలకు జరిగిన ” పోటీల్లో మహారాష్ట్ర జట్టుకు 53 పాయింట్లు రాగా ఉత్తర ప్రదేశ్ జట్టు 49 పా 15 యింట్లతో మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా ఉమ్మడి కడప జిల్లా జడ్పీచైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పొలా శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాంబాబు ,జడ్జి పసుపులేటి శంకరయ్య లతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు హాజరై క్రీడాకారుల ను పరిచయం చేసుకొని ఫైనల్ పోటీలను ప్రారంభించి ఉత్కంఠ భరితంగా సాగిన పోటీలను అక్కడే ఉండి చివరి వరకు తిలకించారు.
చివరగా విజేతలుగా నిలిచిన హర్యానా జట్టుకు జడ్పీ చైర్మన్ ఆకే పాట అమర్నాథరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, కమిషనర్ రాంబాబు. ఆకేపాటి మురళి రెడ్డి ల చేతుల మీదుగా జాతీయ ఓవరాల్ ఛాంపియన్ కప్పును అందజేశారు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో నిలిచిన రాజస్థాన్, మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర జట్లకు కప్పులను అందజేశారు. దీంతో విజేతలగా నిలిచిన హర్యానా జట్టు క్రీడాకారులు విజయ దరహాసం చూపుతూ జాతీయ ఓవరాల్ ఛాంపియన్షిప్ తో ఎగిరి గంతులు వేశారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ విద్యార్థులు చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అటు క్రీడాకారులను ఫైనల్ పోటీలను తిలకించేందుకు వచ్చిన ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.