38.2 C
Hyderabad
April 29, 2024 12: 03 PM
Slider ముఖ్యంశాలు

రంజాన్ ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు ఇంట్లోనే జరపండి

Abbas-Naqvi

ఈ నెల 24 నుంచి రంజాన్ నెల ప్రారంభం అవుతుండటం వల్ల మత పరమైన ఆచారాలను ఇళ్లలోనే ఉండి జరుపుకోవాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కోరారు. ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ముస్లింలు అందరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. భౌతిక దూరం తప్పని సరిగా ఉండాలని అలా చేయకపోతే సంబంధిత వ్యక్తులకే కాకుండా కుటుంబం మొత్తం ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు.

మత పెద్దలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాలతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు మసీదుల్లో ప్రార్ధనలు నిషేధించాయని నఖ్వీ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

ఏ మాత్రం అజాగ్రత్తగా అందరికీ హాని జరుగుతుందని, కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అధికార యంత్రాగం ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను విధిగా పాటించాలని కేంద్ర మంత్రి కోరారు.

Related posts

జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

రాష్ట్రంలో 30 ల‌క్ష‌ల మందికి ఇండ్లు మంజూరు అయ్యాయి

Satyam NEWS

చీరాలలో 471 ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కరణం

Satyam NEWS

Leave a Comment