30.7 C
Hyderabad
May 5, 2024 06: 50 AM
Slider జాతీయం

శ్రే ఫైనాన్స్ నుంచి భారీ ఆర్డర్ సొంతం చేసుకున్న శానీ

sany 1

ప్రపంచంలోనే అతి పెద్ద భారీ నిర్మాణ యాంత్రాల తయారీ సంస్థ గా పేరు పొందిన శానీ కంపెనీ ఎక్స్ కాన్ 2019 లో తన విస్త్రత శ్రేణి యంత్రాలను ప్రదర్శిస్తున్నది. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ బెంగళూరులో నిర్వహిస్తున్న ఎక్స్ కాన్ 2019 ప్రపంచంలోనే అతి పెద్ద నిర్మాణ యంత్రాల ఎగ్జిబిషన్ గా పేరు పొందింది. దేశ విదేశాల నుంచి 1250 మంది భారీ యంత్రాల తయారీదారులు ఈ ఎగ్జిబిషన్ లో పాలుపంచుకుంటున్నారు.

శానీ సౌత్ ఏసియా అండ్ శానీ హెవీ ఇండస్ట్రీ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గార్గ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ లో తమకు భారీ ఆర్డర్ దక్కిందని వెల్లడించారు. శ్రే ఫైనాన్స్ నుంచి 130 ఎక్సకవేటర్లకు ఆర్డర్ రావడం తమకు గర్వకారణమని తెలిపారు.

ఎగ్జిబిషన్ తొలి రోజే శ్రే ఫైనాన్స్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ డి కె వ్యాస్, అధ్యక్షుడు అమిత్ దంగ్ తమ కంపెనీ పనితీరును చూసి ఈ భారీ ఆర్డర్ ను ఇచ్చారని ఆయన తెలిపారు.  ఎక్స్ కాన్ 2019 లో తాము నిర్మాణ రంగానికి ఉపకరించే కొత్త యంత్రాలను కూడా తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు.

నిర్మాణ రంగంలో విశేష ప్రగతి సాధిస్తున్న భారత్ లో తమ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉందని, అన్ని పెద్ద ప్రాజెక్టులకు ఉపకరించే యంత్ర సామాగ్రిని తాము రూపొందిస్తున్నామని దీపక్ గార్గ్ తెలిపారు. అందుకే భారత్ లోని తమ ఫ్యాక్టరీ దినదిన ప్రవర్థమానం అవుతున్నదని, ఉత్పుత్తుల సామర్ధ్యాన్ని కూడా పెంచుతున్నామని ఆయన వివరించారు. ఎక్స్ కాన్ ఎగ్జిబిషన్ లో శానీ 12 నూతన యంత్ర పరికరాలను ప్రదర్శించింది.

సాంకేతికంగా అత్యాధునిక డిజైన్, అతి సులభమైన నిర్వహణ, విశ్వసనీతయ కలిగి ఉన్న శానీ భారీ యంత్ర పరికరాలు అంతర్జాతీయంగా పేరు పొందాయి. ఎక్స్ కవేటర్లు, ట్రక్ క్రవ్లర్, ఆల్ టెరియన్ క్రేన్స్, రోడ్డు నిర్మాణ యంత్రాలు అయిన గ్రేడర్లు, మైనింగ్ యంత్ర సామాగ్రి, ఫిలింగ్ రిగ్ లాంటి నూతన ఆవిష్కరణలు సందర్శకులను ఎంతో ఆకర్షించాయి.

Related posts

Cbd Hemp Oil Floyds

Bhavani

లేటెస్ట్ పోస్టర్:నాగచైతన్య సాయి పల్లవి ల లవ్ స్టోరీ

Satyam NEWS

దయగల మానవుడి హృదయమే దేవుడి నిలయం

Satyam NEWS

Leave a Comment