దయగల మానవుడి హృదయమే భగవంతుని నిలయమని శ్రీ శ్రీ శ్రీ మధుసూదనానంద సరస్వతీ అన్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ఏల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్పల్లి గీతా మందిరంలో శ్రీ శతచండీ మహాయాగం రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ మధుసూధనానంద సరస్వతీ భక్తుల ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్వామీజీ అన్నారు.
భగవంతుని నామాన్ని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని, నిత్యం భగవద్గీతను పఠించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గీతా మందిరం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, కార్యదర్శి, ప్రదాన ఆర్చకులు రాచర్ల రఘురామశర్మ, ఉపాధ్యక్షులు గడ్డం రాంరెడ్డి, ప్రకాష్ వివిధ గ్రామాల భక్తులు ఈ రోజు కన్నుల పండుగ గా జరిగిన చండీహావనం లో పాల్గొన్నారు.