28.7 C
Hyderabad
April 26, 2024 08: 56 AM
Slider సినిమా

లేటెస్ట్ పోస్టర్:నాగచైతన్య సాయి పల్లవి ల లవ్ స్టోరీ

love story poster

అక్కినేని నాగచైతన్య 19 మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. దీనికి సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని ట్విటర్ లో షేర్ చేశాడు ఆయన. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తాను, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్ ను షేర్ చేశాడు. సంక్రాంతి కానుకగా శేఖర్‌ కమ్ముల టీం ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ దానికి సంబంధించిన పోస్ట్‌ర్‌ను విడుదల చేసింది.

ప్రేమ కథా చిత్రాలను ఫీల్ గుడ్‌గా చూపించే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా చైతూకి జోడీగా ఫిదా పోరి సాయి పల్లవి నటించింది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఫిదా, హ్యాపీడేస్, గోదావరి, ఆనంద్ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్‌ని అందించిన శేఖర్ కమ్ముల తాజా చిత్రానికి ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఆయన చిత్రాల మాదిరిగానే తాజా పోస్టర్ కూడా ఫీల్ గుడ్ అనేలా ఉంది. తన ఇష్టసఖుడ్ని కాలర్ పట్టుకుని తగ్గరకు లాక్కుని.. కళ్లు మూసుకుని ఇరు స్వాసల పోట్లాటతో ప్రేమ తన్మయం పొందుతున్నారు.

ఈ ఫస్ట్ లుక్‌లో సాయి పల్లవి చాలా క్వాజువల్ లుక్‌లో ఎప్పటిలాగే ఉండగా.. నాగచైతన్య పెరిగిన గెడ్డంతో ‘ప్రేమమ్’, ‘మజిలీ’ చిత్రాల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఫిదా చిత్రంలో సాయి పల్లవిని భానుమతి ఒక్కటే పీస్ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టించిన శేఖర్ కమ్ముల మరోసారి ఆమెను రిపీట్ చేసి ఈసారి ఎలాంటి హిట్ కొడతారో చూడాలి

Related posts

బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య

Satyam NEWS

మార్చి 4న ములుగు జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడి ఎన్నిక

Satyam NEWS

కోవిడ్ దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక “టెలి-స్పందన”

Satyam NEWS

Leave a Comment