27.7 C
Hyderabad
May 4, 2024 08: 38 AM
Slider ప్రత్యేకం

ప్రధాని పర్యటన కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

modi mission

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో దాదాపు ఏడు వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్‌ నిలిచిపోయిన ఉదంతం జరిగినందున ఎలాంటి పొరబాట్లు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

శనివారం నాడు ప్రధాని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు, పటాన్‌చెరు వద్ద గల ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. దిల్లీ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని బేగంపేట చేరుకుంటారు. హెలికాప్టర్‌లో 2:45 గంటలకు…ఇక్రిశాట్‌కు చేరుకుని స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.

మొక్కల రక్షణ కోసం వాతావరణ మార్పు పరిశోధన కేంద్రాన్ని, రాపిడ్‌ జనరేషన్‌ అడ్వాన్స్‌మెంట్‌ సౌకర్యాన్ని ప్రారంభిస్తారు. స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించి, ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేస్తారు. అక్కడ ఆయన శాస్త్రవేత్తలతో భేటీ అవుతారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు చేరుకొని రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.

ప్రధాని పర్యటించే మార్గంలో అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజనింగ్‌ (ఏఎస్‌ఎల్‌) మొదలుపెట్టారు. ముచ్చింతల్‌  లో ప్రత్యేకంగా అత్యాధునిక కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 5.15కి ప్రధాని యాగశాలకు చేరుకుంటారు.  5.30 నుంచి 6 గంటల వరకు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత రామానుజుల విగ్రహాన్ని ప్రపంచానికి అంకితం చేస్తారు. అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించి సందేశాన్నిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీ వెళ్తారు.

Related posts

అక్టోబ‌రు 11 నుండి 15 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు

Satyam NEWS

ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, పెండింగ్ చ‌లానాల‌పై దృప్టి

Sub Editor

పేదల కాలనీలు పట్టించుకోని బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్

Satyam NEWS

Leave a Comment