Slider ప్రత్యేకం

ఎయిడెడ్ పాఠ‌శాల‌లపై నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాలి…!

#cpivijayanagaram

ఏపీలోని చెర‌కు పంట‌పై యావ‌త్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేయాల‌ని సీపీఐ పార్టీ నిర్ణ‌యించింది. అందుకు ముందుగా చెర‌కు పంట అధికంగా ఉన్న జిల్లాల్లో అఖిల ప‌క్షం నిర్వహించాల‌ని పార్టీ తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు…విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రైమ‌న న‌గ‌రంలోని ట్యాంక్ బండ్ వ‌ద్ద ఉన్న అమ‌ర్ భ‌వ‌న్  లో..ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

అంత‌కుముందు భీమ‌సింగ్ షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ సంద‌ర్శించారు. అనంత‌రం అమ‌ర్ భ‌వ‌న్ స్థానిక జిల్లా పార్టీ నేత‌ల‌తో  క‌ల‌సి సంయుక్తంగా రామ‌కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు ఎంతగానో ఉపయోగపడే భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ ప్రస్తుతం మూతపడడం ఎంతో బాధాకర‌మ‌ని..రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.

ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి సీఎం జ‌గ‌న్ ధోరణి విడనాడాల‌ని…అనంతపురంలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడం పై సీపీఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద‌న్నారు.. కళాశాలలో ఉన్న విద్యార్థుల పై లాఠీచార్జి చేయడం,  అమ్మాయిలను కొట్టడం అత్యంత బాధాకరమ‌ని  కళాశాలలో పోలీసులువెళ్ళటం ఏంటని రామ‌కృష్ణ  ప్రశ్నించారు. ప్రస్తుతం ప్ర‌ధాని మోడీ ప్రభుత్వం అవ‌లంబిస్తున్న‌ ప్రజావ్యతిరేక విధానాలనే జ‌గ‌న్  ప్ర‌భుత్వం అనుస‌రిస్తోంద‌న్నారు.

ఎంతో మంది ప్రాణ త్యాగాల తో ఏర్పడ్డ విశాఖ ఉక్కు ప్రైవేటీకరించడం సరైన పద్ధతి కాద‌ని  ఈ సంద‌ర్భంగా సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ అన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి  ఒమ్మి  రమణ,  సహాయ కార్యదర్శులు  బుగత అశోక్ ,అలమండ ఆనందరావులు పాల్గొన్నారు. 

Related posts

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

Murali Krishna

సవాల్ కు సై…చర్చకు సిద్ధమా?

Bhavani

లంబాడి బంజారా తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వద్దు

Satyam NEWS

Leave a Comment