29.7 C
Hyderabad
May 6, 2024 05: 40 AM
Slider విజయనగరం

ఉర్దూ పాఠ‌శాల‌లో దేశ‌ తొలి విద్యాశాఖా మంత్రి జ‌యంతి…!

#vijayanagaramteachers

ఓ వైపు వ‌ర్షం ప‌డుతున్న మ‌రోవైపు ఎంఎల్ సీ ఎన్నిక‌ల కోడ్ ఉన్నా…విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్ర‌మై విజ‌య‌న‌గ‌రంలో అతి పురాత‌న ఉర్దూ పాఠ‌శాల‌లో దేశ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ క‌లాం ఆజాద్ జ‌యంతి జ‌రిగింది. ఎన్నిక‌ల కోడ్ ఉన్న నేప‌ధ్యంలోజిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ..భారీ ఎత్తున జ‌యంతి వేడుక‌లు జ‌రిపిందేకు మైనార్టీ శాఖ య‌త్నించినా…అతి సున్నితంగా ఆ వేడుక‌ల‌ను నామ మాత్రంగానే జ‌ర‌గాల‌ని కేవ‌లం బొకే తీసుకుని అక్క‌డ నుంచీ క‌లెక్ట‌ర్ నిష్ర్క‌మించారు.

ఈ  సంద‌ర‌ర్భంగా ఉర్దూ పండిట్ ఎండీఅస‌లాం ఖాన్ ను జిల్లా మైనార్టీ శాఖ జ్ఙాపిక బ‌హుకరించి స‌త్క‌రించింది.ఈ సంద‌ర్బంగా జిల్లా మైనార్టీ శాఖ ఏడీ  మాట్లాడుతూ….దేశ తొలి  విద్యా శాఖ మంత్రి జ‌యంతి దినోత్స‌వాన్ని జాతీయ విద్యా దినోత్స‌వంగా జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. అలాగే మైనార్టీ శాఖ ఆద్వ‌ర్యంలో ఉర్దూ పాఠ‌శాల‌లో  ఉర్దూ పండిట్ ను స‌న్మానించుకోవడం ఎంతో సంతోష దాయ‌క‌మ‌న్నారు. ఈ కార్యక్ర‌మంలో క‌రీం భాష‌,అబీబ్ , ఉర్దూ పాఠ‌శాల టీచ‌ర్లు, పిల్ల‌లు  మైనార్టీ నేత‌లు పాల్గొన్నారు.  

Related posts

రైల్వే సిగ్నల్ వ్యవస్థను పెంచి ప్రమాదాల నుండి కాపాడాలి

Satyam NEWS

తల్లిదండ్రుల తరువాత గురువుదే అగ్రస్థానం

Satyam NEWS

పప్పు దినుసులకు అధిక ధర చెల్లించ వద్దు

Satyam NEWS

Leave a Comment