28.7 C
Hyderabad
May 6, 2024 10: 22 AM
Slider నిజామాబాద్

కొట్టుకు పోవడానికి సిద్ధంగా ఉన్న పెద్ద దేవాడ తాత్కాలిక రోడ్డు

#Heavy rains

బుధవారం కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని దేవాడ బ్రిడ్జి వద్ద తాత్కాలికంగా వేసిన రోడ్డు ప్రమాదకరంగా మారి నీటి ప్రవాహానికి కొట్టుక పోవడానికి సిద్ధంగా మారింది. ఎగువ జుక్కల్ మండలంలో కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పెద్ద దేవాడ గ్రామం వద్ద తాత్కాలికంగా నిలిపి వేసిన వంతెన నిర్మాణ పనుల పక్కన వేసిన మొరం రోడ్డు పైపులు మునిగి నీరు ప్రవహించాయి.

నీటి ప్రవాహం ఎక్కువై ప్రమాదకరంగా మారడంతో బాన్సువాడ బిచ్కుంద నడిచే బస్సులను ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పెద్ద దడ్గీ, సీతారాం పల్లి, ఎల్లారం గ్రామాల మీదుగా బస్సులను నడిపినట్లు కంట్రోలర్ సాయిలు తెలిపారు.

వర్షం పడడం ఇలాగే కొనసాగితే ఎప్పుడైనా తాత్కాలిక రోడ్డు కొట్టుకు పోవచ్చు అని ఎలాంటి ప్రాణాపాయ ప్రమాదాలు జరగకుండా రోడ్డు పై నుండి ఆటోలు ద్విచక్ర వాహనాలు నడవకుండా అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Related posts

ఎస్సైగా కొడుకు.. అంతులేని ఆనందంలో పేరెంట్స్

Satyam NEWS

ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ బడ్జెట్

Satyam NEWS

పాపం తల్లి కదా ఇంతకన్నా ఇంకేం చేస్తుంది?

Satyam NEWS

Leave a Comment