33.2 C
Hyderabad
May 3, 2024 23: 41 PM
Slider నల్గొండ

కరోనాను కట్టడిచేసేందుకు వ్యాపారస్తులు సహకరించాలి

#Hujurnagar Municipality

లాక్ డౌన్ సడలింపు తరువాత కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా హుజూర్ నగర్ పట్టణంలో “మనం లాక్ డౌన్ పాటిద్దాం. కరోనా వైరస్ ను కట్టడి చేద్దాం.”అన్న నినాదంతో పట్టణ ప్రజలందరూ  భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ ను కట్టడి చేసే  కార్యక్రమంలో వ్యాపారస్తులు తదితరులు కూడా సహకరించాలని ఆమె కోరారు. కరోనాను కనుమరుగయ్యేలా చేయాలని అధికారులకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, చాంబర్ ఆఫ్ కామర్స్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన కాలంలో విధంగా “ఉదయం 6  గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాపార సంస్థలు, కార్యాలయాలు తమ తమ వ్యాపార లావాదేవీలు చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ 3 నుండి 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత పరిసర పరిశుభ్రత పాటించాలని అన్నారు.

మాస్కులు ధరించి అత్యవసరమైతే  మాస్కులు ధరించి బయటికి రావాలని, పనిపై బయటకు వచ్చినా  ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ తప్పక పాటించాలని కోరారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో మునిసిపల్ సిబ్బంది పరిసరాల పరిశుభ్రత కోసం తగిన చర్యలు తీసుకుంటుందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరారు.

Related posts

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నల్ల బ్యాడ్జీలతో వెళ్ళండి

Satyam NEWS

జీహెచ్ఎంసీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఏర్పాట్లు పూర్తి

Sub Editor

మానవత్వమా నీ చిరునామా ఎక్కడ?

Satyam NEWS

Leave a Comment