41.2 C
Hyderabad
May 4, 2024 16: 49 PM
Slider ఆదిలాబాద్

ఆసిఫాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్న వాన

#rain

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆసిఫాబాద్ మండలంలోని గుండి, తుంపెల్లి వాగులు, వరదతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులు, ఒర్రెల పరీవాహక ప్రాంతాల్లో పంట చేలు నీటమునిగాయి. మొలక దశలో ఉన్న పత్తి కొట్టుకుపోయింది. చీర్రకుంట, వట్టివాగు, తుంపెల్లి గుండి పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. తిర్యాణీ, వాంకిడి మండలాల్లోని గ్రామాల్లో  ఒర్రెలపై వంతెనలు లేకపోవడం,కొన్నిచోట్ల లోలెవెల్ వంతెనలు ఉండటంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వంతెనలు వాగు ఉధృతికి  దెబ్బతింది.అదే వాగుపై లంజన్ వీర వద్ద వంతెన సమీపంలో రహదారి కోతకు గురైంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

Related posts

నగిరిలో మంత్రి రోజాకు సీటు ఇస్తే ఓడిస్తాం

Satyam NEWS

వినాయక మండపాలకు అనుమతి నిరాకరణ పై భజరంగ్ దళ్ నిరసన

Satyam NEWS

అనంతనాగ్ లో మళ్లీ కూలీలపై కాల్పులు

Satyam NEWS

Leave a Comment