37.7 C
Hyderabad
May 4, 2024 12: 31 PM
Slider ప్రత్యేకం

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున హెరాయిన్ స్వాధీనం

#heroin

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుకున్నారు. మొత్తం రూ.21.90 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు పట్టుకుని ఒకరిని అరెస్టు చేశారు.

సౌత్ ఆఫ్రికాకు చెందిన ఒక మలావియన్ జాతీయురాలు అయిన మహిళా ప్రయాణీకురాలు ఈ హెరాయిన్ ను తీసుకువస్తున్నట్లు కచ్చితమైన సమాచారం రావండంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కాపుకాశారు. నైరోబీ నుండి ఖతార్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ నంబర్ క్యూఆర్ 500 ద్వారా బిజినెస్ వీసాపై ప్రయాణిస్తున్న ఆమె బ్యాగేజీని (ట్రాలీ బ్యాగ్) క్షుణ్ణంగా పరిశీలించగా 3.129 కిలోలు దాచిపెట్టినట్లు తేలింది.

ఆమె ట్రాలీ బ్యాగ్ లో ఒక కనిపించని అరలో రెండు పాలిథిన్ కవర్లలో గట్టిగా ప్యాక్ చేశారు. నిషేధించిన ఈ మాదక ద్రవ్యం అంతర్జాతీయ గ్రే మార్కెట్‌లో కోట్ల రూపాయల విలువ చేస్తుంది. డీఆర్‌ఐ అధికారులు ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానం ప్రవేశపెట్టి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Related posts

దిండుతో అదిమి పెట్టి వృద్ధ దంపతుల దారుణ హత్య

Satyam NEWS

అయోధ్య తీర్పు నేపథ్యంలో నాలుగు అంచెల భద్రత

Satyam NEWS

జాబిల్లిపై కీలక ఘట్టంపై ప్రత్యక్ష ప్రసారం

Satyam NEWS

Leave a Comment