38.2 C
Hyderabad
May 5, 2024 22: 24 PM
Slider ముఖ్యంశాలు

భారీ వర్షాలతో హిమాచల్‌ అతలాకుతలం

#heavy rains

హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అక్కడి జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. సిమ్లాలో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. భారీ వర్షాల కారణంగా 92/6-92/7 వద్ద జుటోగ్ – సమ్మర్ హిల్ రైల్వే స్టేషన్ల మధ్య కల్కా-సిమ్లా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో కందఘాట్-సిమ్లా మధ్య రైళ్ల రాకపోకలు నిలిచపోయాయి.

కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం జరిగినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ప్రాణనష్టం చాలా బాధాకరమన్నారు. స్థానిక ప్రభుత్వంతో పాటు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Related posts

ప్రయివేటు టీచర్లను ఆదుకుంటున్న ప్రభుత్వ టీచర్లు

Satyam NEWS

ఆల్విన్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Satyam NEWS

టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తేనే సంక్షేమం

Satyam NEWS

Leave a Comment