మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉద్యమ స్ఫూర్తి తో టిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెలంగాణ శాసనసభ కాంగ్రెస్ పక్ష నేత మధిర శాసనసభ్యుడు భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. యువత, రైతు, పేద, వెనుకబడిన వర్గాలు కాంగ్రెస్ ను గెలిపించి ప్రజాస్వామ్య గొంతుకను నిలబెట్టాలని ఆయన నేడు ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.
నాటి తెలంగాణ ఉద్యమం సాగిందే కొలువుల కోసం అయితే నేటి తెలంగాణ లో కేసీఆర్, ఆయన కుటుంబం యువతను మోసం చేసిందని భట్టి అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు యువత బుద్ధి చెప్పాలని భట్టి అన్నారు. పేదవారికి రెండు పడకల ఇండ్లు నిర్మాణం జరగాలన్నా, రైతులకు రుణమాఫీ జరగాలన్నా, రైతు బంధు అందాలన్నా, 57 సంత్సరాలు నిండిన వారికి పింఛన్ అందాలన్నా ఈ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ పార్టీను గెలిపించాలని తద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని భట్టి పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పకుంటే రానున్న రోజులు ఈ ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయదని భట్టి అన్నారు.