28.7 C
Hyderabad
May 6, 2024 02: 25 AM
Slider నిజామాబాద్

ఆ ఇద్దరి చేతుల్లోకి మున్సిపల్ వెళ్తే అంతే

#mlakatipalli

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆయన సోదరునిపై హాట్ కామెంట్స్ చేశారు. వాళ్ళిద్దరి చేతుల్లోకి మున్సిపాలిటీ వెళ్తే అంతే పరిస్థితి అంటూ వ్యాఖ్యానించారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం, ఈ నెల 15 న నూతన చైర్మన్ ఎన్నిక అంశాలపై క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట రమణారెడ్డి మాట్లాడారు. కామారెడ్డిలో రాజకీయ మార్పు రావాలని తాను కోరుకున్నానని, అవినీతి రహిత కామారెడ్డిగా చూడటమే తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే అవిశ్వాసం పెట్టి పదవుల నుంచి దింపేయడం రివాజుగా మారిందని,

రాజకీయ స్వలాభం కోసమే ఏ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలోకి మారడం మంచి పద్ధతి కాదన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 12, బీజేపీ 8, స్వతంత్రులు 6, బీఆర్ఎస్ 29 కౌన్సిలర్ స్థానాలు గెలిచారన్నారు. కాలక్రమేణా కౌన్సిలర్లు పార్టీలు మారుతూ వస్తున్నారని, ప్రస్తుతం నాలుగు కౌన్సిలర్ స్థానాలు ఉన్న కాంగ్రెస్ 27 కు చేరుకుందని తెలిపారు. చైర్మన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం పెట్టడంతో చైర్మన్ పార్టీకి సంబంధించిన 10 మంది అవిశ్వాసానికి మద్దతిచ్చి చైర్మన్ ను పదవి నుంచి తప్పించారన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి అంతమైంది.. ఇకపై నీతివంతమైన పాలన అందిస్తామని  ప్రకటించారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీనుద్దేశించి వ్యాఖ్యానించారు.

మాస్టర్ ప్లాన్ వెనుక ఆ నలుగురూ…

అవినీతి పరులు ఎవరు.. అవినీతికి సంబంధించి ఆధారాలున్నాయా.. అవినీతి అంతా చైర్మన్ నిట్టు జాహ్నవి చేసారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ముజీబోద్దీన్ 10 మంది కౌన్సిలర్లను అవిశ్వాసానికి ఓటయ్యాలని ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. వీళ్లంతా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ను కాదని వెళ్ళారా అని నిలదీశారు. ఈ కౌన్సిలర్లు వెళ్లి షబ్బీర్ అలీ అనుచరులకు, తమ్ముడు నయీమ్ చెప్పిన వారికి ఓటెయ్యలేదా అన్నారు. సర్వే నంబర్ 6 లో ఉన్నది ఆ నలుగురే కదా.. మాస్టర్ ప్లాన్ వెనక ఉన్నది ఆ నలుగురే కదా అన్నారు. అవినీతి ఎక్కడ జరిగింది.. చైర్మన్ జాహ్నవి చేసారా.అన్న ఆయన చైర్మన్ తండ్రి నిట్టు వేణుగోపాల్ రావు చేయొచ్చన్నారు. వందల ఎకరాల స్కాములలో చేసి ఆయనకు లక్షల్లో ఇవ్వొచ్చన్నారు. తాను చేపట్టిన ప్రజాదర్బార్ లో నిట్టు వేణుపై అవినీతికి పాల్పడ్డారని ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని తెలిపారు.

కలెక్టరేట్ వెనకాల జయశంకర్ కాలనిలో ఉన్న 20 ఎకరాల అసైన్ ల్యాండ్ కబ్జా చేసిందెవరని, ఆ భూములు మాజీ ఎమ్మెల్యే కొడుకు గంప శశాంక్, ఆయన కూతురు పేర్ల మీద రిజిస్టర్ కాలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు 1000 గజాలు క్యాన్సిల్ చేసుకోలేదా అని నిలదీశారు. ఈ అవినీతి అంతా చేసిందెవరు.. గంప గోవర్ధన్, ముజీబోద్దీన్, నయీమ్ కాదా.. మాస్టర్ ప్లాన్ భూములలో షబ్బీర్ ఆలీకి భూమి లేదా అని ప్రశ్నించారు. ఆ భూమికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా చూయించానని, ఇప్పుడా భూమి అమిన్ చౌహాన్ పేరుమీద ఉన్నదని, ప్రస్తుతం 40 ఎకరాలు మళ్ళీ లే ఔట్ కు పెట్టుకున్నారన్నారు.

అవినీతి చెట్టు షబ్బీర్ అలీ

జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కోట్లాడి 4 కోట్లు తాగునీటి వసతి కోసం మంజూరు చేసుకుంటే షబ్బీర్ అలీ ఏమో కౌన్సిలర్లకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని రోడ్ల కోసం 5 కోట్లు ఇవ్వాలని పెట్టారని, వేసవి కాలం తాగునీటి సమస్య ముఖ్యమా.. రోడ్లు ముఖ్యమా అని ప్రశ్నించారు. అవినీతి ఎక్కడ జరుగుతుంది.. అవినీతి అంతం ఎక్కడయిందో కౌన్సిలర్లు ఆలోచించాలన్నారు. షబ్బీర్ అలీ అవినీతి చెట్టు అని ఆ చెట్టుకు పుట్టిన రెక్కలు మిగతావన్నారు. ఇలాంటి వ్యక్తుల చేతిలోకి మున్సిపల్ వెళ్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలన్నారు.

మార్కెట్లో ట్యాక్స్ కోసం వెళ్తే 10 మంది హైయెస్ట్ ట్యాక్స్ ప్లెయర్స్ ఉన్నారని, ఎలక్షన్ కోడ్ తర్వాత టాక్స్ కట్టాల్సిన మోస్ట్ బకాయి వాళ్ళ పేర్లు బయటపెడతానని డప్పు పెట్టి చాటింపు వేయిస్తానన్నారు. వీళ్ళను డబ్బులు కట్టమని అడిగితే నయీమ్ పేరు చెప్తున్నారని తెలిపారు. కౌన్సిలర్లు ఒక్కసారి ఆలోచించాలని, ఏం జరుగుతుంది. అనేది చూసుకోవాలని సూచించారు. అవినీతికి ఆద్యులేవరో.. ఇప్పుడు నిట్టు జాహ్నవిని తీసేస్తే అవినీతి అంతం అయిపోయిందా అని ప్రశ్నించారు. ఈ నెల 15 న చైర్మన్ ఎన్నిక జరుగుతుందని, కౌన్సిలర్లు ఆలోచించి నీతి నిజాయితీ ఉన్న ఏ అభ్యర్థినైనా నిలబెట్టాలని సూచించారు. ఇద్దరు అన్నదమ్ముల చేతికి మున్సిపల్ వెళ్తే కామారెడ్డి ఉండే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే కామారెడ్డి వంటి వరస్ట్ మున్సిపాలిటీ లేదని చెప్పారు.

లీడర్ల కోసం కాదు… ప్రజల కోసం

49 మంది కౌన్సిలర్లు కూర్చుని మాట్లాడుకుని పార్టీలతో సంబంధం లేకుండా నిజాయితీ గల వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకోండి. అప్పుడు నేను కూడా మీకు మద్దతిస్థానని తెలిపారు.  కామారెడ్డి పట్టణ ప్రగతి కోసం పని చేయాలని, ఒకరిద్దరు లీడర్ల కోసం కాదని కోరారు. చైర్మన్ కాగానే మాస్టర్ ప్లాన్లో రోడ్లు వేసుకుందాం అనుకుంటున్నారేమో.. తాను ఉన్నంత కాలం ఆ పని జరగనివ్వనన్నారు. తప్పు జరిగితే తప్పుడు ఎఫ్ఐఆర్ లు చేస్తే పోలీస్ స్టేషన్ కూడా వెళ్లి కొట్లాడుతానని తెలిపారు. కోడ్ ముగిసిన తర్వాత ఎక్కడ తప్పు జరిగినా అక్కడికే వెళ్లి నిలదీస్తానని, సమస్య పరిష్కస్తానన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

అనంత ఆనందాన్నిచ్చే అనంత పద్మనాభ వ్రతం

Satyam NEWS

షాక్ కొడుతున్నకరెంటు బిల్లులు

Satyam NEWS

ప్రాథమిక విద్యావిధానంలో మార్పులు వద్దు: సీపీఎం

Satyam NEWS

Leave a Comment