28.7 C
Hyderabad
April 28, 2024 05: 32 AM
Slider విజయనగరం

ప్రాథమిక విద్యావిధానంలో మార్పులు వద్దు: సీపీఎం

#new education system

విద్యావిధానం పట్ల జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 28 న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడుతున్నట్లు సీపీఎం రాష్ట్ర నేత కృష్ణ మూర్తి తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో ఎల్జీ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానాన్ని  రాష్ట్రంలో అమలు చేందుకు వైఎస్సార్ ప్రభుత్వం పూనుకుంటుందని ఆరోపించారు. అందులో భాగంగానే 3,4,5, తరగతులు ను హైస్కూల్ కి మార్చేందుకు ప్రయతిస్తున్నదని ఆరోపించారు.

దీంతో పిల్లలు దూరం స్కూళ్లకు వెళ్ళలేక.. బడి మానేసే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు.. ఫలితంగా 25 వేళ ఉద్యోగాలు తీయనవసరం లేకుండా పోతాయని… అందుకే జాబ్ కేలండర్ లో డీఎస్సీ ప్రకటించ లేదన్నారు.

ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా లక్షా ఎనభై వేల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని తెలిపారు. వాటిని భర్తి చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పి కేవలం 10 వేళ ఉద్యోగాలు మాత్రమే జాబ్ కేలండర్ లో ప్రకటించడం సిగ్గు చేటని అన్నారు. నిరుద్యోగుల  జీవితాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నారు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం కృష్ణ మూర్తి ఆరోపించారు.

ఈ నేఫధ్యంలో ప్రభుత్వం పై విద్యా విధానంలో మార్పులు ఆపాలని కోరుతూ 28 న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చే పడతామన్నారు.. సీపీఎం జిల్లా కార్యదర్శి టీ. సూర్యనారాయణ అన్నారు. ఈ మీడియా సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు కూడా పాల్గొన్నారు.

Related posts

లోన్ యాప్ లపై జాగ్రత్త

Satyam NEWS

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు

Satyam NEWS

పంచాయితీ నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారుల విచారణ

Satyam NEWS

Leave a Comment