29.7 C
Hyderabad
May 7, 2024 04: 24 AM
Slider నల్గొండ

కోవిడ్ 19 కోసం ఇంటింటి సర్వేలో భాగంగా ఆకస్మిక తనిఖీ

#household survey

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రంలో సోమవారం కోవిడ్-19 రెండవ విడత ఇంటింటి సర్వేలో భాగంగా MPDO ఇసాక్ హుస్సేన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

తనిఖీలో భాగంగా కొన్ని సూచనలు చేశారు.ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, ప్రభుత్వం విధించిన లాక్డౌన్ విధిగా పాటించాలని అన్నారు.

అత్యఅవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రావొద్దని,ఎవరికైన కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కిట్ తీసుకొని మందులు వాడాలని,కలెక్టరేట్ కార్యాలయంలో కోవిడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినందున మండలంలో ఇట్టి విషయం ప్రజల ఇబ్బందులు తెలుసుకొనుట  కొరకు టోల్ ఫ్రీ నంబర్స్ 6281492368, 6300957120 ఏర్పాటు చేశామని, కనుక కోవిడ్ సంబంధిత సమస్యలు ఉన్నవారు టోల్ ఫ్రీ నంబర్స్ కి ఫోన్ చేసి  తెలియపర్చవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో MPDO వెంట కార్యదర్శి E.నారాయణ రెడ్డి, అంగన్వాడీ టీచర్ ప్రియాంక, ANM లు, తదితరులు ఉన్నారు.

Related posts

సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు

Satyam NEWS

పార్టీ నుంచి బీఆర్ఎస్ నేతలు సస్పెన్షన్

Murali Krishna

ఐదుగురు భార్యల ముద్దుల మొగుడు ఏం చేస్తాడు?

Satyam NEWS

Leave a Comment