40.2 C
Hyderabad
April 28, 2024 16: 31 PM
Slider ఆదిలాబాద్

సోషల్ మీడియా లో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు

#Nirmal SP

నిర్మల్ జిల్లాలో కొంత మంది తెలిసి తెలియని పరిజ్ఞానంతో ఇతర మతాలను, వ్యక్తులను కించపరిచేలా నిరాధారమైన పోస్టులు సోషల్ మీడియాలో పెడుతూ, ప్రజలలో వైషమ్యాలను పెంచేలా, భావోద్వేగాలను రెచ్చగొట్టేలా శాంతి భద్రతలకి విఘాతం కలిగేలా చేస్తున్నారని జిల్లా ఇన్చార్జి ఎస్పి విష్ణు ఎస్ వారియర్ అన్నారు.

వాట్సాప్ లోని వివిధ గ్రూప్ లలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి ఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు నిర్మల్  పట్టణంలో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.

గ్రూపులో సభ్యుడు తప్పుడు పోస్టులు పెట్టినా అడ్మిన్ ల పై కూడా చర్య తీసుకుంటామని అన్నారు. అలాంటి వారిని వెంటనే గ్రూపులో నుంచి తొలగించాలని అడ్మిన్ లకు హితవుపలికారు.

Related posts

సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS

సినిమా రివ్యూ: ఆకట్టుకున్న యండమూరి వీరేంద్రనాధ్ అతడు ఆమె ప్రియుడు

Satyam NEWS

చేదుకో కోటయ్య చేదుకో అంటూ బయలుదేరిన కాకాణి ప్రభ

Satyam NEWS

Leave a Comment