33.2 C
Hyderabad
May 15, 2024 13: 26 PM
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ రద్దును కేటీఆర్ ఏ హోదాలో చేశారు..?

#katipalli

రద్దు చేసినట్టు ప్రిన్సిపల్ సెక్రెటరీతో చెప్పించాలి: బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి

కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తేనే ఇక్కడి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తారా అని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతులు రోడ్డెక్కి ఉద్యమం చేశారని, రైతుల ఆందోళనతో నాడు మున్సిపాలిటీ పాలకవర్గం మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారన్నారు. మాస్టర్ ప్లాన్ మీద లోకాయుక్తలో ఫిర్యాదు చేసామని, కలెక్టరేట్ ముట్టడి తర్వాత రైతులపై పోలీసులు దాడి చేసి కొడితే హెచ్ఆర్ ను ఆశ్రయించామన్నారు. తమ ఫిర్యాదుపై సమాధానం పంపాలని లోకాయుక్త కలెక్టర్ కు నోటీసు ఇచ్చిందని తెలిపారు. ఆర్టీఏ ద్వారా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాస్టర్ ప్లాన్ రద్దుపై సమాచారం కోరితే జిఓ 478 తేదీ 19.09.2000 ప్రకారమే మాస్టర్ ప్లాన్ అమలులో ఉంటుందని కమిషనర్ చెప్పారని, మాస్టర్ ప్లాన్ రద్దయిన తరవాత 100 ఫీట్ల రోడ్డు ఆన్లైన్లో ఎలా అప్రూవల్ అయిందో కమీషనర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఇతర నాయకులకు చెందిన భూముల కోసమే రోడ్ల కోసం ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని చెప్పడానికి కేటీఆర్ కు ఏం అధికారం ఉందన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేశామని ప్రిన్సిపల్ సెక్రటరీ లోకాయుక్తతో పాటు కోర్టులో రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నారు. ఉద్యమం తర్వాత మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ రద్దు చేసింది ఉత్తదేనా.. కేటీఆర్ చెప్తేనే రద్దయినట్టా అని నిలదీశారు. కేటీఆర్.. ఇలాంటి ప్రకటనలతో రైతులు మిమ్మల్ని ఎలా నమ్ముతారన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దయితే నిర్మల్, మెట్ పల్లి, కరీంనగర్, నిజామాబాద్, భూపాలపల్లి మాస్టర్ ప్లాన్ సంగతేందని ప్రశ్నించారు. కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే రద్దు చేస్తారా అని నిలదీశారు. అలా అయితే మిగతా నియోజకవర్గాల రైతులు ఆలోచించాలని సూచించారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలిచినా ఓడినా, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఎలా అమలు చేస్తారో చూస్తానన్నారు. ప్రజలే కాదు.  ప్రకృతి కూడా కెసిఆర్ కు బుద్ది చెప్తుందని, ఇప్పటికే కాళేశ్వరం రూపంలో ప్రకృతి తన ప్రతాపం చూపిందని పేర్కొన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

వ‌ర‌ద స‌హాయంతోనే స‌బిత‌మ్మ‌కు న‌‌ష్ట‌మా?

Sub Editor

(Free|Trial) Aspen Clinic Weight Loss Pills Universal Weight Loss Supplements

Bhavani

శివోహం: తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన ముక్కంటి ఆలయాలు

Satyam NEWS

Leave a Comment