23.7 C
Hyderabad
May 8, 2024 05: 31 AM
Slider హైదరాబాద్

PRCI ఆధ్వర్యంలో ‘ప్రపంచ కమ్యూనికేటర్స్ దినోత్సవం’

#prci

ప్రపంచ కమ్యూనికేటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) హైదారబాద్ విభాగం సోమవారం హైదరాబాద్ థ్రిల్ సిటీ లో  లో కార్యక్రమాన్ని నిర్వహించింది.  ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నామ్ధారీ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, దక్షిణాఫ్రికాలోని లెసోతో కింగ్డమ్ గౌరవ కాన్సుల్ జనరల్ సూరజ్ సింగ్ మల్హోత్రా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సమర్థవంతమైన కమ్యూనికేషన్ ఆవశ్యకతను ఆయన ప్రస్తావించారు. వ్యాపారం, కార్పొరేట్ ప్రపంచంలో కమ్యూనికేషన్ పోషిస్తున్న కీలక పాత్రను తగు ఉదాహరణలతో వివరించారు. సుదీర్ఘమైన వ్యాపారానుభవం, ఈ రంగంలో గడించిన అపార జ్ఞానంతో కొనసాగిన ఆయన ప్రసంగం ప్రేక్షకులకు ఎన్నో మెళుకువలతో పాటు స్ఫూర్తిని రగిలించాయి.

అనంతరం ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఆర్. పృథ్వీరాజ్ ‘కంటెంట్ కనెక్ట్స్ కమ్యూనికేషన్ – 3C’ అనే సబ్జెక్టు పై ప్రసంగించారు. మీడియాతో విశ్వసనీయమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి  విషయ నాణ్యత, సంబంధిత అంశాల పై ప్రామాణికమైన సమాచారాన్ని అందించడానికి ప్రజాసంబంధాలు, కార్పోరేట్ కమ్యూనికేషన్ నిపుణుల ఆవశ్యకతపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అవసరం ఆధారిత విషయమే కమ్యూనికేషన్ కు ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. ఏదైనా సమాచారం, వార్తల సమాహారానికి అంతిమ లక్ష్యం ప్రజలే అని, మీడియా మధ్యవర్తిగా మాత్రమే పనిచేస్తుందని గుర్తుంచుకోవాని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PRCI) జాతీయ ఉపాధ్యక్షుడు కె. రవీంద్రన్ తన పరిచయ ప్రసంగంలో ‘ప్రపంచ కమ్యూనికేటర్స్ డే’ ప్రాముఖ్యత పై ప్రసంగించారు.  1906 అక్టోబరు 28న USAలో విడుదల చేసిన మొదటి పత్రికా ప్రకటన ఆధారంగా కమ్యూనికేషన్ ఎలా అభివృద్ధి చెందింది అనే అంశాన్ని సభికులకు వివరించారు. ఈ వృత్తిలో వస్తున్న నిరంతర మార్పులకు అనుగుణంగా సన్నద్ధమవ్వడానికి  ప్రజాసంబంధాల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో భారతదేశం, విదేశాలలో పిఆర్ సిఐ  పోషిస్తున్న పాత్రను ఆయన వివరించారు.

పిఆర్ సిఐ హైదరాబాద్ విభాగం ఛైర్మన్ షకీల్ అహ్మద్ సభకు స్వాగతం పలికి, ప్రజాసంబంధాల నిపుణుల కోసం ఫెసిలిటేటర్ గా సంస్థ ముందుకు సాగుతున్న తీరును వారికి వివరించారు. సూరత్ సింగ్ మల్హోత్రా, ఆర్. పృథ్వీరాజ్ ల ను షకీల్ అహ్మద్  ప్రేక్షకులకు పరిచయం చేశారు. పిఆర్ సిఐ యంగ్ కమ్యూనికేటర్స్ క్లబ్ (YCC) డైరక్టర్ ఫ్రెడ్రిక్ మైఖేల్, డైరెక్టర్  ప్రజాసంబంధాలు, జర్నలిజం, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి వేదికలకు చెందిన యువ నిపుణుల నైపుణ్యాలను మెరుగుపర్చడానికి సంస్థ చేపట్టే కార్యకలాపాలను వివరించారు.  పిఆర్ సిఐ సౌత్ జోన్ హెడ్ టివిఎస్ నారాయణ్ భారతదేశంలోని అన్ని దక్షిణాది రాష్ట్రాలలో పిఆర్ సిఐ కార్యకలాపాల వివరాలను అందించారు. పీఆర్సీఐ, హైదరాబాద్ వైస్ చైర్పర్సన్ జి. అనీజ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిఆర్ సిఐ హైదరాబాద్ విభాగం సెక్రటరీ ఫిలిప్ జాషువా, జాయింట్ సెక్రటరీ జాకబ్ రాస్ భూంపాగ్, ట్రెజరర్ నోయెల్ రాబిన్సన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

“దిశ జాగృతి”తో పోక్సో నేరాలు తగ్గుముఖం

Satyam NEWS

ప్రభుత్వ వైఖరిపై ఆర్టీసీ కార్మికుల నిరసన దీక్షలు

Satyam NEWS

ఇళ్ళ పట్టాలు పంపిణి

Murali Krishna

Leave a Comment