32.2 C
Hyderabad
May 9, 2024 19: 40 PM
Slider పశ్చిమగోదావరి

వైసీపీ నిరంకుశ రాజ్యానికి చరమగీతం పాడాలి

#janasena

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ  కమిటీ సమావేశం సోమవారం ఏలూరు మినీ బై పాస్ లో గ్రాండ్ కృష్ణ కళ్యాణ మండపం లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు, నర్సాపురం పార్లమెంట్ జిల్లా టిడిపి అధ్యక్షులు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మరియు జనసేన టిడిపి ప్రముఖులు  పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లుగా నిరంకుశ వైసిపి ప్రభుత్వం రాజ్యమేలుతోందని, జగన్ రెడ్డి ప్రజాస్వామ్యయుతంగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా తన సొంత అజెండా తో వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని  ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఏ తప్పు చేయని నిప్పులాంటి చంద్రబాబుని కక్షపూరితంగా జైల్లో పెట్టిందని అన్నారు.

ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురి చేసే చర్యలను టిడిపి, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎదుర్కొంటాయని రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు సంయుక్తంగా పోటీ చేస్తాయని, రేపు నవంబర్ ఒకటి నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఉమ్మడిగా కలిసి ప్రయాణించేలా సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి చింతలపూడి నియోజకవర్గ నుంచి మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ, మాజీ కన్వీనర్ జగ్గావరపు ముత్తారెడ్డి, పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్ర శేషు, జనసేన పార్టీ నుంచి మేకా ఈశ్వరయ్య తదితర ప్రముఖులు హాజరై చింతలపూడి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని అందుకు కార్యాచరణ రూపొందించుకొని ఉమ్మడిగా ముందుకు వెళ్తామని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, తోట సీతామహాలక్ష్మి, మాజీ ఎంపీ మాగంటి బాబు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, మాజీ మంత్రినక్కా ఆనంద్ బాబు, ఉండి మాజీ ఎం ఎల్ ఏ శివరామరాజు, గోపాలపురం టి డి పి ఇంచార్జి మద్దిపాటి వెంకట రామరాజు షరీఫ్, మాజీ మంత్రి జవహర్ మరియు జనసేన జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం అధ్యక్షులు తదితర ప్రముఖులు హాజరయ్యారు.

Related posts

చివ‌రి షెడ్యూల్లోకి ఎంట‌రైన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’

Satyam NEWS

జర్నలిస్టులకు ఎక్రెడిటేషన్ల జీవోపై హైకోర్టు నోటీసులు

Satyam NEWS

మచిలీపట్నానికి లెనిన్కుమార్ భౌతికకాయం

Bhavani

Leave a Comment