39.2 C
Hyderabad
May 4, 2024 20: 19 PM
Slider ముఖ్యంశాలు

లాక్ డౌన్: ఎంత కాలం ఇలా భయపడుతూ బతకాలి?

lock down 101

లాక్ డౌన్ అమలులో ఉన్నా మనదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గలేదు. మరణాలు ఆగలేదు. ఇంత విశాలమైన దేశంలో, ఇంత ఎక్కువ జనాభా ఉన్న దేశంలో లాక్ డౌన్ లేకపోతే మరిన్ని మరణాలు సంభవించేవి అలా జరగనందుకు సంతోషం అది లాక్ డౌన్ వల్లే సాధ్యమైందని కొందరు వాదిస్తున్నారు.

అయితే లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం కాదు. ఉదాహరణకు రోగికి మత్తు ఇవ్వటం తాత్కాలికం. మత్తు దిగేలొపు సర్జరీ చేసెయ్యలి అదేవిధంగా లాక్ డౌన్ ఎత్తేసే లోపు ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం, జనసమూహం నుండి అనుమానితులని వేరు చేయటం యుద్ధ ప్రాతిపదికన జరగాలి.

అలా జరిగిందా? జరగలేదు అనేది కఠోర వాస్తవం. ఈ కఠోర వాస్తవాన్ని కప్పి పుచ్చుకుంటూ లాక్ డౌన్ ను పొడిగించుకుంటూ పోతే ఎలా? ఎన్ని రోజులు ఎన్ని నెలలు పొడిగిస్తారు? లాక్ డౌన్ నుంచి మొదటగా గ్రామాలను విముక్తి చేయాలి.

ఇప్పుడు చేతికి వచ్చిన పంటలు అప్పుడు ఇంటిదాకా వస్తాయి. లేకపోతే చేలో పంటలు నేల పాలైపోతాయి. అప్పుడు ఆకలి చావులు చావాల్సి వస్తుంది. అందుకే ముందు గ్రామాలను లాక్ డౌన్ నుంచి ముందుగా మినహాయించాలి. రైతులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. వారు వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుమతించాలి.

ఆ తర్వాత ప్రభుత్వం గ్రామాలకు వెళ్లి ఆ పంటలను కొనుగోలు చేయాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొంత మేరకు అలా చేస్తున్నది. ఆ తర్వాత పట్టణ ప్రాంతాలను లాక్ డౌన్ నుంచి విముక్తం చేయాలి. పట్టణ ప్రాంతాలలో వైరస్ ఉన్న రెడ్ జోన్ లను గుర్తించి అంత వరకూ లాక్ డౌన్ చేస్తే సరిపోతుంది.

ఇప్పుడు కొన్ని చోట్ల అలానే చేస్తున్నారు. పరిశ్రమలపై లాక్ డౌన్ ఎత్తేయాలని. ఏ పరిశ్రమలో కార్మికులను అక్కడే ఉంచి వసతి సదుపాయాలు వైద్య సౌకర్యాలు కల్పించాలి. అప్పుడు పారిశ్రామిక ఉత్పత్తి యధా ప్రకారం కొనసాగుతుంది. దేశం మొత్తం లాక్ డౌన్ చేసి అందరికి తిండి పెట్టే బదులు ఇలా కొన్ని ప్యాకెట్లను వేరు చేసి వాటిపై శ్రద్ధ పెడితే దేశం పురోగమిస్తుంది.

అంతే కాని సంపూర్ణ లాక్ డౌన్ సమస్యకు పరిష్కారం కాదు. చివరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టును అనుమతించాలి. కార్య క్షేత్రంలో అధికార సిబ్బందితొ పాటు ఉద్యోగులను విద్యార్థులను NCC క్యాడెట్ లను సోషల్ యాక్టివిస్టులను విధులకు వినియోగించుకోవాలి అప్పుడు మాత్రమే ప్యాకెట్ లాక్ డౌన్ సఫలమవుతుంది.

కరోనా పారిపొతుంది. ఆర్ధిక ప్రగతి పుంజుకుంటుంది.

కేసానుపల్లి వెంకటేశ్వర్లు, సత్యం న్యూస్ సిటిజన్ జర్నలిస్టు

Related posts

ఆత్మరక్షణ కొరకు మాకు ఆయుధాలు ఇవ్వండి

Satyam NEWS

ఛలో ఢిల్లీ రైతు పోరాటానికి ప్రజలు పెద్ద ఎత్తున కదిలి రావాలి

Satyam NEWS

కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు

Bhavani

Leave a Comment