38.2 C
Hyderabad
May 2, 2024 22: 46 PM
Slider నల్గొండ

ఛలో ఢిల్లీ రైతు పోరాటానికి ప్రజలు పెద్ద ఎత్తున కదిలి రావాలి

#CITUHujurnagar

ఛలో ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని బిజెపి ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా పాల్గొని విజయవంతం చేయాలని, 3 వ్యవసాయ కార్మిక చట్టాలు తక్షణమే రద్దు చేయాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళ భవన నిర్మాణ కార్మిక సంఘం సోమవారం కలెక్టర్ కార్యాలయ ముట్టడికి సూర్యాపేట బయల్దేరిన సందర్భంగా రోషపతి పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 24వ, తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని మన భారతదేశ చరిత్రలో వీర తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అతి పెద్ద పోరాటం ఇదేనని, ఈ పోరాటంలో పాల్గొనుటకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు.

దేశంలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించాలని అన్నారు.ఈరోజు గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు తట్టుకునే పరిస్థితి లేదని, ఇలాంటి దుర్మార్గమైన పాలన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడు ఎదుర్కోలేదని తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ,భారతదేశ ప్రజల ఆస్తిని పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెడుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమయ్య గౌడ్, మండల అధ్యక్ష్య, కార్యదర్శి ఎస్ కే ముస్తఫా, గోవిందు, వెంకన్న,సైదులు, వేణు, రాము, జానీ, రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తహశీల్దార్, పోలీస్ స్టేషన్ పనులన్నీ పూర్తి చేయాలి

Bhavani

పంచెకట్టు తో ఆకట్టుకున్న నట సింహం

Satyam NEWS

రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment