23.2 C
Hyderabad
May 8, 2024 00: 36 AM
Slider గుంటూరు

ఆత్మరక్షణ కొరకు మాకు ఆయుధాలు ఇవ్వండి

#balakotaiah

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అరాచకాలు, అత్యాచారాలను పురస్కరించుకొని బలహీనులైన ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వారికి ఆత్మరక్షణ కొరకు ఆయుధాలు ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పలువురు దళిత, బిసి నాయకులతో కలిసి  మాట్లాడుతూ కంచే చేను మేసిన చందంగా  రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఇందుకు ఐపిసి వైసీపీ గా మారటమే కారణం అని ఆరోపించారు.

తమను తాము కాపాడుకునేందుకు దళిత, గిరిజనులకు ఆత్మ రక్షణ ఆయుధాలు చాలా అవసరం అన్నారు. గత నాలుగేళ్ల వైకాపా పాలనలో జరిగిన డాక్టర్ సుధాకర్ , డాక్టర్ అచ్చెన్న, చీరాల కిరణ్ బాబు, అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, గూడూరు కిరణ్,  శిరోముండనం వరప్రసాద్,పులివెందుల నాగమ్మ,నంద్యాల మహాలక్ష్మి, గుంటూరు రమాకాంత్ భాయ్, కర్నూలు వజీర,  వంటి సంఘటనలతో పాటు  రెండ్రోజుల క్రితం జరిగిన బాపట్ల కు చెందిన 15 ఏళ్ల అమర్నాథ్ ను దగ్ధం చేసిన సంఘటన, కాకినాడలో పార్వతి ఆత్మహత్యాయత్నం,విశాఖ ఎంపీ భార్య ,కుమారుల కిడ్నాప్  సంఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనటానికి అద్దం పడుతున్నాయని చెప్పారు.

డిజిపి  రాజేంద్రనాథ్ రెడ్డి ఒక్కరే ఆర్డర్ లో ఉన్నారని,రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఆర్డర్ లో లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ ,ఎస్టీ, మహిళా కమిషన్ కార్యాలయాలకు తాళాలు వేసుంటారని, వారి జాడ కనిపించటం లేదు అన్నారు. కేంద్రం లోని మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ,ఎస్టీ కమిషన్లు రాష్ట్రం  వైపు చూడాలని డిమాండ్ చేశారు. విశేష రాజ్యాంగ అధికారాలు గలిగిన గవర్నర్, రాష్ట్రపతి  ఏపీలో జరుగుతున్న మారణకాండపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం,జనసేన, బిజెపి ఏపీలోని శాంతిభద్ర స్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టి కి తీసుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో  నేషనల్  నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు, అమరావతి బహుజన ఐకాస నాయకులు వజ్రాల రవి శంకర్, తిరుమలశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

Satyam NEWS

వేములవాడలో శ్రీరామనవమి సందర్భంగా త్రిరాత్రి ఉత్సవ హావనం

Satyam NEWS

శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రం మెలోడి సాంగ్ ‘నిను చూశాక..’ విడుదల

Satyam NEWS

Leave a Comment