27.7 C
Hyderabad
May 14, 2024 10: 07 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు ‘బి’ గ్రేడ్ లభించటం పట్ల హర్షం

#dergeecollege

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ‘బి’గ్రేడు సాధించినట్లు కళాశాల ప్రధానాచార్యులు మల్లిరెడ్డి భీమార్జున రెడ్డి తెలిపారు.

ఏప్రిల్ 28,29వ,తేదీలలో బెంగుళూరు నుండి వచ్చిన న్యాక్ పేర్ టీమ్ కళాశాలలోని బోధన,బోధనేతర పనితీరును,కళాశాలలోని మౌళిక సదుపాయాలు పరిశీలించి నివేదిక తయారు చేసి న్యాక్ డైరెక్టర్ల బృందానికి అందజేశారు.ఇచ్చిన నివేదిక ఆధారంగా కళాశాలకు’బి’ గ్రేడ్ లభించిందని కళాశాల ప్రధానాచార్యులు మల్లిరెడ్డి భీమార్జున రెడ్డి తెలిపారు.

కళాశాలకు ‘బి’ గ్రేడ్ లభించటం పట్ల బోధన,బోధనేతర సిబ్బంది తమ హర్షం వ్యక్తంచేశారు.రాష్ట్రం లోని అనేక పెద్ద పెద్ద కళాశాలలు సాధించలేని గ్రేడ్ ను హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధించి ప్రతిష్ఠాత్మకమైన కళాశాలల సరసన నిలవటం ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ లభించిన బి గ్రేడు ఐదు సంవత్సరాల పాటు చలామణిలో ఉంటుందని,ఈ విజయం అందరి సమిష్టి కృషితో లభించిందని,తద్వారా కళాశాలకు నిధులు వచ్చే అవకాశం ఉందని,కళాశాల మరింత అభివృద్ధి పథంలో పయనింప చేయడానికి తమ వంతు కృషి శక్తివంచన లేకుండా చేస్తామని భీమార్జన రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యాక్ సమన్వయకర్త పి.నాగరాజు, బోధనా సిబ్బంది,బోధనేతర సిబ్బంది,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలి

Satyam NEWS

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Satyam NEWS

బందీ గా ఉన్న పోలీసును అప్పగిస్తాం: మావోల కీలక ప్రకటన

Satyam NEWS

Leave a Comment