38.2 C
Hyderabad
May 5, 2024 19: 06 PM
Slider నల్గొండ

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలి

#municipalworkers

మున్సిపల్ కార్మికులకు వేతనం వెయ్యి రూపాయలు పెంపు కంటితుడుపు చర్య అని,ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా నెలకి 21,000 రూపాయలు ఇవ్వాలని,మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున మున్సిపల్ కార్మికులతో రోషపతి మాట్లాడుతూ మేడే సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి కెసిఆర్ మేడే కానుకగా గొప్పగా ప్రకటించడం,ఈ పెంపుదల నామ మాత్రమేనని 1,000 రూపాయలు  ఈనాడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు సరిపోదని,దీనివల్ల కార్మికులకు ఒరిగేదేమీ లేదని,ఏ ప్రయోజనం లేదని  అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో  పిఆర్సి లో కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బేసిక్ పే 19,000 రూపాయలు నిర్ణయించి చెల్లించాలని,పిఆర్సి కమిషనర్ నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నుండి 3,400 రూపాయలు తగ్గించి 15 వేల 600 రూపాయలు నిర్ణయించి కంటితుడుపు చర్యలు కాకుండా పునరాలోచన చేయాలని,ఆంద్రప్రదేశ్ ఇస్తున్న విధంగా నెలకి 21,000 రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,అర్హులైన ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని,ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందని శీతల రోషపతి అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య,కార్యదర్శులు  కస్తాల ముత్తమ్మ,మెరిగు దుర్గారావు,కస్తాల సైదులు,రవి,కుమారి,చంద్రకళ,చంటి, పుల్లయ్య,దేవకరణ,సైదులు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి,  హుజూర్ నగర్

Related posts

ఐఏఎస్ అధికారులపై అభిశంసన తిప్పిపంపిన జగన్ సర్కార్

Satyam NEWS

ఇసుక దోపిడికి అడ్డుగా నిలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి

Bhavani

బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణానికి భక్తులు రావద్దు

Satyam NEWS

Leave a Comment