29.7 C
Hyderabad
May 7, 2024 04: 36 AM
Slider ప్రత్యేకం

సాంస్కృతిక కళా రీతులతో ఆకట్టుకుంటున్న హునార్ హాట్

#hunarhaat

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హునార్ హాట్ ఎంతో మందిని ఆకట్టుకుంటున్నది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అద్భుతంగా ఉన్నాయని సందర్శకులు చెబుతున్నారు. దేశంలోని పెద్ద కళాకారులు తమ కళలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. భద్రత, పరిశుభ్రత, పక్కా ప్రణాళికతో కూడిన పార్కింగ్ ఏర్పాటు చేసారు. హునర్ హాట్ ఇతర ఈవెంట్‌లతో పోల్చితే చాలా వేరుగా ఉంది. అంతే కాకుండా హునర్ హాట్‌లో చేసిన ఆకర్షణీయమైన సెల్ఫీ పాయింట్లు కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ప్రధాన ద్వారం ముందు నిర్మించిన “ఇండియా గేట్” ప్రజలను ఆకర్షిస్తుంది. సమీపంలో ఉంచిన ఆకర్షణీయమైన పెద్ద తబలా కూడా సెల్ఫీ ప్రియులు చాలా ఇష్టపడుతున్నారు. ఫుడ్ కోర్ట్ “మేరా గావ్ మేరా దేశ్”లో పార్క్ చేసిన ఎద్దుల బండితో ప్రజలు ఫోటోలు దిగుతున్నారు. సమీపంలో నిర్మించిన సింబాలిక్ సెల్యులార్ జైలు కూడా సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇందులో దేశ స్వాతంత్య్రంలో సమర్ధవంతమైన పాత్ర పోషించి ప్రాణాలర్పించిన అమరవీరుడు ముజ్తబా హుస్సేన్, బిషెన్ సింగ్, ఆనంద్ చరణ్ పాల్, అబ్దుల్ ఖాదర్, పండిట్ పర్మానంద్ విగ్రహాల ద్వారా వారి పోరాటాన్ని, బలిదానాన్ని చాటిచెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు, హస్తకళాకారులు, చేతివృత్తుల వారి నైపుణ్యాలను వివరించే హునార్ హాట్ లో వారందరికీ ఆరాధించే భగవంతుడు విశ్వకర్మ తోట కూడా రూపొందించబడింది. చేతిలో సుత్తితో సెల్ఫీ పాయింట్ శ్రామిక ప్రజల కథను చెబుతోంది. పిల్లలు,పెద్దలు, వృద్ధులు హునార్ హాట్ ను ఆస్వాదిస్తున్నారు. హునార్ హాట్ చూసిన తర్వాత, నగరంలో మొదటిసారిగా ఇంత చక్కగా  నిర్వహించబడిన కార్యక్రమాన్ని చూశామని ప్రజలు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ప్రతిరోజు జనం భారీగా తరలివస్తున్నప్పటికీ ఎవరికీ ఇబ్బందులు కలగకుండా, ప్రజలు సులభంగా షాపింగ్ చేయగలుగుతున్నారు. సాంప్రదాయ రుచికరమైన వంటకాలను ఆస్వాదించగలుగుతున్నారు. సర్కస్, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చూసి ఆనందిస్తున్నారు.

Related posts

రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా చిత్రం ఆద్య

Satyam NEWS

బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు

Satyam NEWS

27, 28 తేదీలలో జూమ్ ద్వారా తెలుగుదేశం పార్టీ “మహానాడు”

Satyam NEWS

Leave a Comment