28.7 C
Hyderabad
April 28, 2024 06: 40 AM
Slider నల్గొండ

బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు

#roshapati

దళిత బంధువు పథకం గురించి ఒక మాటలో చెప్పాలంటే గూడెంకి ఒక కోడి ఇంటికో ఈకలా ఉందని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ లో ఎన్నికల లబ్ధి కోసం దళిత బంధు పథకం పెట్టి రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అది అధికార పార్టీ వాళ్ళ కోసమేనని,దాంట్లో అనేక అవకతవకలు బయట పడ్డాయని,ఒక మాటలో చెప్పాలంటే ఈ పథకం దళిత వాడకి (ఒక కోడి) ఇంటికో (ఈకలా) ఉందని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి తీవ్రంగా ఆరోపించారు.

సోమవారం టి ఎన్ టి యు సి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో వీధి వ్యాపారం చేసుకొని రోడ్ల పక్కన వివిధ పనులు చేసుకొనే దళిత,గిరిజనులను సర్వే చేసిన సందర్భంగా అనేక సమస్యలు వారు చెప్పి ఆగ్రహం వెళ్ళబోసుకున్నారని రోషపతి తెలిపారు.

తెల్ల రేషన్ కార్డులు వాడేవారు కూడా అనేక విషయాలు తెలిపినారని,కెసిఆర్ ప్రభుత్వం కంటే ముందు ఉన్న కిరణ్ కుమార్ ప్రభుత్వం కార్డు మీద 11 నుంచి 14 వస్తువులు ఇచ్చేవారని,ప్రధానంగా పంచదార,కందిపప్పు,గోధుమలు అధిక రేట్లు ఉండే వస్తువులని తెల్ల రేషన్ కార్డు మీద ఇచ్చేవారని,మనకు తెలంగాణ ఏర్పడితే ఇప్పటి వరకు ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారని,మన ప్రభుత్వం మనకు ఉపయోగపడింది అని కెసిఆర్ ఉన్న సరుకులన్నీ రద్దుచేసి ఒక మొద్దు బియ్యం మాత్రమే ఇస్తున్నారని,ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారో ఆలోచించాలని, ఎంతవరకు సమంజసమో మేధావి వర్గం ఆలోచించాలని అన్నారు.ఈ రాష్ట్రంలో కొద్దిగా రైతుకు కుటుంబాలకు కొంత లాభం తప్ప మిగతా కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్స్,ఉద్యోగులు,పేద ప్రజలను ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని,ఈ వర్గాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాయత్తం అవుతున్నట్లు వారి మాటల్లో తెలుస్తుందని అన్నారు. ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని శీతల రోషపతి అన్నారు.

ఈ కార్యక్రమంలో  సైదులు,ఆళ్ల  భాగ్యమ్మ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

భక్తి శ్రద్ధలతో గురునానక్ జయంతి వేడుకలు

Satyam NEWS

New year special: తాగి వాహనాలు నడిపితే తాటతీస్తాం

Satyam NEWS

గుండెపోటుతో టిఆర్ఎస్ నాయకుడు నాగేశ్వరరావు మృతి

Satyam NEWS

Leave a Comment