35.2 C
Hyderabad
April 27, 2024 14: 46 PM
Slider జాతీయం

పరువు నష్టం దావాపై రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట

#rahulgandhi

ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేసిన కేసులో స్థానిక కోర్టుకు హాజరుకాకుండా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి మంజూరైన రిలీఫ్‌ను బాంబే హైకోర్టు సోమవారం జులై 28 వరకు పొడిగించింది. పరువు నష్టం దావాపై విచారణను జూలై 28కి వాయిదా వేయాలని జస్టిస్ పీడీ నాయక్‌తో కూడిన బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది.

రాఫెల్ ఫైటర్ జెట్ ఒప్పందంపై 2018లో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ ‘కమాండర్-ఇన్-ది-థిఫ్’ వ్యాఖ్యను ఉపయోగించారని, ఇది ఆయన పరువుకు భంగం కలిగించడమేనని మహేష్ శ్రీమల్ అనే బిజెపి కార్యకర్త పరువునష్టం దావా వేశారు. పరువు నష్టం ఫిర్యాదుకు సంబంధించి గత ఏడాది నవంబర్ 25న హాజరు కావాలని స్థానిక కోర్టు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి సమన్లు ​​జారీ చేసింది.

దీని తర్వాత, రాహుల్ గాంధీ బాంబే హైకోర్టు లో అప్పీలుకు వెళ్లారు. స్థానిక కోర్టు ఇచ్చిన సమన్లను సవాలు చేశారు. పరువు నష్టం ఫిర్యాదుపై విచారణను వాయిదా వేయాలని మేజిస్ట్రేట్‌ను గత నవంబర్‌లో హైకోర్టు ఆదేశించింది. అంటే కాంగ్రెస్ నాయకుడు మెజిస్ట్రేట్ ముందు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ పీడీ నాయక్ ధర్మాసనం ముందుకు మళ్లీ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు విచారణను జూలై 28కి వాయిదా వేస్తూ మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది.

Related posts

ఉగాది ఉత్సవాలకు శ్రీశైలంలో పటిష్ట బందోబస్తు

Satyam NEWS

సాక్షి దినపత్రికలో సగం భాగం నాదే: వై ఎస్ షర్మిలా రెడ్డి

Satyam NEWS

ఆటో,వ్యాన్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తా

Satyam NEWS

Leave a Comment