29.2 C
Hyderabad
October 10, 2024 19: 00 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

నా కొడుకును చంపేయండి ఇలాంటి కొడుకు నాకొద్దు

mother

ప్రియాంకరెడ్డి మర్డర్ కేసులో నాలుగో నిందితుడు చింతకుంట చెన్నకేశవులు (20). ఇతని గురించి తల్లి జయమ్మ ఎంతో ఆవేదన చెందుతోంది. ఆమె ఏం చెప్పిందంటే: జక్లేర్‌ వ్యక్తి(మహ్మద్‌ ఆరిఫ్)తో స్నేహం చేసిన తర్వాతే నా కొడుకు పాడైపోయాడు. లారీ లోడ్‌ చేయాలని వాడే నా కొడుకును తీసుకుపోయిండు. ఇప్పుడు ఊరంతా మా గురించే మాట్లాడుతున్నారు.

అయితే అందరికీ ఒకటే బాధ. తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి నా భర్త ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు తెల్లవారుజామున రెండు గంటలకు నా కొడుకును తీసుకుపోయారు. ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకును అలా చంపినా ఫర్వాలేదు. ఉరి వేయండి లేదా కాల్చి చంపుర్రి. ఇప్పుడు నా కొడుకును ఏం చేయొద్దంటే ఎవరూ వినరు. నా కొడుకు ఇట్లా చేస్తాడనుకోలేదు.

లవ్‌ మ్యారేజీ చేసుకున్నప్పటికీ ఏం అనలేదు. అయ్యిందేదో అయ్యిందనుకున్నాం. నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి కొడుకును కనలేదు కదా. ఆ అమ్మాయి తల్లిది కూడా కడుపుకోతే. అందరిదీ అదే బాధ ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును కూడా అలాగే చంపినా ఫర్వాలేదు. నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు….ఇదీ ఆ తల్లి చెప్పిన తీర్పు.

Related posts

గువ్వలగూడా లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

Satyam NEWS

ఓ వైపు చ‌ర్చ‌లు..మ‌రోవైపు ఆందోళ‌న‌లు…!

Satyam NEWS

అభ్య‌ర్థుల‌ను మార్చ‌క‌పోవ‌డ‌మే కారు బోల్తాకు కార‌ణం?!

Sub Editor

Leave a Comment