26.7 C
Hyderabad
May 3, 2024 10: 41 AM
Slider రంగారెడ్డి

ప్రియాంక హంతకులను తక్షణమే ఉరి తీయాలి

shadnagar

ప్రియాంక హత్య కేసులో దొరికిన దుర్మార్గులను తక్షణమే ఉరితీయాలని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు, ప్రజా సంఘాలు, స్థానికులు నిరసనకు దిగారు. దాంతో షాద్‌నగర్ అట్టుడికిపోయింది. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు హత్యాచార ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని మహిళా, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఈ నలుగురు నిందితులకు న్యాయసహాయం చేయబోమని జిల్లా బార్ కౌన్సిల్ ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని తెలిపింది.

వైద్యురాలిని పక్కా స్కెచ్‌తోనే నిందితులు హత్య చేశారని పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో నలుగురు యువకులు ఈ ఘోరానికి పాల్పడినట్లు తేల్చారు. ఈ కిరాతకానికి సంబంధించి నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ (26), లారీ క్లీనర్‌ శివ (20); అదే మండలం గుడిగండ్లకు చెందిన లారీ క్లీనర్‌ నవీన్‌ (23); మరో క్లీనర్‌ చింతకుంట చెన్నకేశవులు (20) నిందితులని తెలిపారు.

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శుక్రవారం శంషాబాద్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. షాద్ నగర్ పోలీసు స్టేషను ముందు నిందితులను తమకు అప్పగించాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు నచ్చజెప్పినా ఆందోళన కారులు వినకపోవడం చేత లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు.

Related posts

డీడీసీ వైస్ చైర్‌పర్సన్ ను తొలగించాలని వత్తిడి

Bhavani

నో సర్వీస్ :పొగమంచు తో ఢిల్లీ లో విమానసర్వీసుల రద్దు

Satyam NEWS

ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా?

Satyam NEWS

Leave a Comment