Slider ముఖ్యంశాలు

గజం భూమి ఉన్నా రాసిచ్చేస్తా: స్పష్టం చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ

#kamareddy

మాస్టర్ ప్లాన్ రద్దయ్యే వరకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని వెల్లడి

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా గ్రామాల్లో తన పేరున గాని, తన కుటుంబ సభ్యుల పేరున గాని గజం భూమి ఉన్నా రైతులకు రాసిచ్చేస్తానని మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దయ్యే వరకు రైతులతో కలిసి ఉద్యమిస్తానని పేర్కొన్నారు. కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ, రైతు డిక్లరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాస్టర్ ప్లాన్ లో భూములు కోల్పోతున్న బాధిత రైతులతో సమావేశమయ్యారు.

ఈ సందర్బంగా మాస్టర్ ప్లాన్ లో మీ పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని షబ్బీర్ అలీని రైతులు కోరగా పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ విషయంలో అడ్లూర్ గ్రామ రైతులు తనను కలిసి వినతిపత్రం ఇవ్వగానే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ తో మాట్లాడానన్నారు. తన లెటర్ హెడ్ పై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని రద్దు చేయాలని లేఖ రాసి పంపించానని పేర్కొన్నారు.

సంబంధిత లేఖలకు సంబందించిన రిసివ్డ్ కాపీలను రైతులకు అందజేశారు. తాను ఏరోజు కూడా ఒకరిపై ఆశించి పని చేయలేదన్నారు. సాయం కావాలని వచ్చిన ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకున్నానని పేర్కొన్నారు. అలాంటి తాను రైతులకు నష్టం కలిగించే పని ఎలా చేస్తానని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ విషయంలో తనపై, తన కుటుంబ సభ్యులపై భూములు ఉన్నాయని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

తాను పుట్టింది కాంగ్రెస్ లోనని, చచ్చేది కూడా కాంగ్రెస్ లోనేనన్నారు. నాలుగు సార్లు పార్టీ మారి, నాలుగు సార్లు బీఫార్మ్ తీసుకుని పార్టీని మోసం చేసిన వాడిని కాదని బీజేపీ నేత వెంకట రమణారెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు. మాస్టర్ ప్లాన్ విషయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇండస్ట్రియల్ జోన్ కింద భూములు లాక్కోవడం సరికాదన్నారు. హైదరాబాదులో సుమారు 3 వేల ఇండస్త్రీలకు ఓఆర్ఆర్ లోపాల ఉన్న వాళ్ళు బయటకు వెళ్లిపోవాలని నోటీసులిచిన ప్రభుత్వం అమాయకులైన రైతులకు నోటీసులివ్వకుండా భూములు ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు.

హైదరాబాదుకు ఒకచట్టం మనకు ఒక చట్టం ఉంటుందా అన్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి టౌన్ ప్లానింగ్ అధికారిని పిలిపించి వివరాలు తీసుకుంటే షబ్బీర్ అలీ మాజీ మంత్రి.. ఆయనకు టిపిఓ వెళ్లి మాస్టర్ ప్లాన్ ఎలా ఇస్తారని, గంప గోవర్ధనే టిపిఓను షబ్బీర్ అలీ దగ్గరికి పంపించారని ఇక్కడ రమణారెడ్డి ఆరోపిస్తున్నారన్నారు.

నేను గంప గోవర్ధన్ కు లెక్క చేస్తానా

నేను గంప గోవర్ధన్ కు లెక్క చేస్తానా.. ఏదైనా ఉంటే కేసీఆర్ తో డైరెక్ట్ గా మాట్లాడే దమ్మున్న నాయకున్నీ అని చెప్పారు. మీరు చేస్తున్న ఉద్యమం విషయంలో ఒక అడుగు ముందే ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు లేవు.. ఓట్ల కోసం రాలేదు. ఈ ఒక్కసారి పోటీ చేసి చూద్దామని అనుకుంటున్నా.. ఇది ఓట్ల కోసం కాదు.. ఓటు వేసిన ఒకే.. వేయకున్నా ఒకే అన్నారు.

తనకు అడ్లూర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, ఇల్చిపూర్, టెక్రియల్ శివార్లలో ఒక్క గజం భూమి ఉన్నా రాసిచ్చేస్తానన్నారు. తనకు లింగాపూర్ శివారులో 13.14 ఎకరాల భూమి ఉందని, అది కూడా బలిసిన వాళ్ళ వద్దనే కొన్నానని, అమాయకుల వద్ద కొనలేదని చెప్పారు. నాకు కూడా కడుపు ఉంది.. నేను కూడా బిజినెస్ చేయవద్దా.. అని ప్రశ్నించారు. మాట్లాడితే నా కొడుకు పేరుమీద, వాళ్ళు, వీళ్ళ పేరుమీద భూమి ఉందని ఆరోపిస్తున్నారని, ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.

17 సంవత్సరాల క్రితం భూమి కొన్న సమయంలో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ చేస్తారని ఏదైనా కల కన్ననా అని ప్రశ్నించారు. అబ్దుల్లా నగర్ అంటూ హోరెత్తించారని, ఇప్పుడేమైందని ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో మూట దొరకగానే సైలెంట్ అయ్యారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నాయకులు కలగజేసుకోగానే దిష్టిబొమ్మ ఎలా తగులబెడతారని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. దాంతో కొద్దిసేపు అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతులు ఏ విధంగా కార్యాచరణ ప్రకటించినా తాము ముందుంటామన్నారు. తనకు రెండు రోజుల ముందు సమాచారం ఇస్తే వస్తానని చెప్పారు. కేసీఆర్ ఇంటి ముట్టడైనా, ప్రగతి భవన్ ముట్టడైనా సిద్ధమేనన్నారు.

Related posts

చాట్ పూజ ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్ శ్రీ వాణి

Satyam NEWS

‘‘పరీక్ష’’ విద్యార్ధులకు కాదు పాలకులకు

Satyam NEWS

కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment