Slider అనంతపురం

కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలి

అనంతపురం జిల్లాలో ఉన్న 7800 యూ.ఐ ( అండర్ ఇన్వెస్టిగేషన్ ) కేసులు,శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న 13000 యూ.ఐ కేసులలో ఈనెలాఖరు కల్లా 80 శాతం తగ్గించాలని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ ఆదేశించారు. నంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సి.ఐ , ఆపై స్థాయి పోలీసు అధికారులతో నేడు ఆయన రేంజ్ కార్యాలయం నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల12 వ తేదీన జరిగే లోక్ అదాలత్ కార్యక్రమంలో కాంపౌండబుల్ కేసులన్నింటిని డిస్పోజల్ చేసేలా ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది కృషి చేయాలని ఆయన కోరారు. గ్రేవ్ & నాన్ గ్రేవ్ యూ.ఐ కేసుల్లో అరెస్టులు, దర్యాప్తులు పెండింగులో ఉంటే త్వరితగతిన పూర్తి చేసి ఛార్జిషీట్లు వేయాలని ఆయన ఆదేశించారు.

అనంతపురం జిల్లాలో ఉన్న 2 వేల ఎక్సైజ్ కేసులు, శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న 5,600 ఎక్సైజ్ కేసులను తగ్గించాలని ఆయన కోరారు. ఈ కేసులను జిల్లాల ఎస్పీలు సమీక్ష చేసి సీజ్ చేసిన వాహనాల డిస్పోజల్ లో సంబంధిత పోలీసు అధికారులు చట్టపరంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఉభయ జిల్లాలలో కలిపి 350 వరకు మిస్సింగు కేసులు ఉన్నాయి. వీటిలో దాదాపుగా పురోగతి ఉన్నప్పటికీ ఇంకా ట్రేస్ కాని కేసుల ఛేదింపునకు కృషి చేయాలి వచ్చే నెలలో జరుగనున్న లోక్ అదాలత్ లో పి.టి కేసుల డిస్పోజలపై దృష్టి పెట్టాలి అని ఆయన అన్నారు.

వీటన్నింటిపై ఇరు జిల్లాల ఎస్పీలు పర్యవేక్షించాలి. రోజు వారీగా టెలిఫోన్ కాన్ఫరెన్స్ లు నిర్వహించి కనీసం 50 శాతంకు తగ్గకుండా పెండెన్సీ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, ఇతర పోలీసు అధికారులు ఆయా పోలీసు కార్యాలయాల నుండి పాల్గొన్నారు.

సత్యంన్యూస్, అనంతపురం

Related posts

ఛీటింగ్: ప్రేమికుడిపై కోపంతో ఆత్మహత్య

Satyam NEWS

తీన్మార్ మల్లన్న ను వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

సిబ్బంది ఆర్ధిక అవసరాలను తీర్చేందుకే కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ

Satyam NEWS

Leave a Comment