39.2 C
Hyderabad
May 4, 2024 21: 59 PM
Slider కడప

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దంటే అరెస్టు చేస్తారా?

విశాఖ ఉక్కు ప్రైవేటికరిన వ్యతిరేకంగా మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులను కార్మిక నాయకులను అక్రమ అరెస్టులకు నిరసనగా ఏఐటీయూసీ కడప నగర సమితి ఆధ్వర్యంలో కడప నగరంలోని కడప సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కార్మికులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులను అక్రమంగా అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. దేశానికి కాపలాదారుగా వుంటాను, దేశ సంపద వృద్ధి చేస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ దేశసంపదను తెగనమ్ముతూ దేశాన్ని దివాళా తీయిస్తున్నారన్నారు. గత 70సం దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు సంపాదించిన లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వరంగ సంస్థలను, దేశ జాతీయ సంపదను నరేంద్రమోడీ ఏడేళ్ల పాలనలో తెగనమ్ముతున్నాడన్నారు.

లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను కార్పోరేట్ పరం చేయడమే లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారని అందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేసి ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తూ, పరిశ్రమను నూటికి నూరు శాతం అమ్ముతామని పదేపదే ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఉద్యమాలు కొనసాగడంతో పోస్కో కంపెనీ వెనకడుగు వేస్తున్నదని, దీంతో కేంద్ర ప్రభుత్వం టాటా స్టీల్ ను ముందుకు తీసుకు రావడంపై కార్మిక వర్గం తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చుతోందని విశాఖఉక్కును ప్రభుత్వ రంగంలోనే ఉంచాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానించినా, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయపార్టీలు కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమాలు చేస్టునప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని ప్రజలకు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కడప జిల్లా డిప్యూటీ సెక్రటరీ కేసి.బాదుల్లా, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణమూర్తి, సిపిఐ కడప నగర కార్యదర్శి ఎన్.వెంకటశివ, ఏఐటీయూసీ కడప నగర ప్రధాన కార్యదర్శి ఉద్దె. మద్దిలేటి, నగర అధ్యక్షుడు పిచ్చినేని సుబ్బారాయుడు, ఏఐటీయూసీ కడప నగర యకులు ఆర్ బాబు, తారక రామారావు, శంకర్ నాయక్, శాంతమ్మ, హుస్సేన్, నారాయణ, నాగిరెడ్డి, చెన్నయ్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ ప్రభుత్వంపై భగ్గుమన్న కాపు మాజీ ఐఏఎస్ ఐపిఎస్ లు

Satyam NEWS

గణనాయకుని శుభాశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

Satyam NEWS

తండా స్కూళ్లలో బాల వికాస సేవలు హర్షణీయం

Satyam NEWS

Leave a Comment