39.2 C
Hyderabad
May 3, 2024 13: 41 PM
Slider నిజామాబాద్

తండా స్కూళ్లలో బాల వికాస సేవలు హర్షణీయం

tanda school

బాల వికాస సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు చాలా గొప్పవని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండాలో బాల వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి శుద్దికారణ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా పాఠాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు చేసిన ప్రత్యేక అందరిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేసిన యోగ చూపరులను ఆకట్టుకుంది. అనంతరం బాల వికాస మెంబర్ షిప్ కోసం చేపట్టిన లాటరీని ప్రభుత్వ విప్  గంప గోవర్ధన్ చేతుల మీదుగా తీశారు.

మొదటి బహుమతిగా 5 వేలు, రెండవ బహుమతికి 3 వేల రూపాయలు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా అందజేశారు. తర్వాత గ్రామస్తులకు నీటి డబ్బాలను అందజేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ… స్వచ్ఛమైన నీటిని అందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు కోట్లాది రూపాయలు బాల వికాస సంస్థ ఖర్చు చేయడం గొప్ప విషయమని చెప్పారు.

ప్రజలు ఈ బాల వికాస నీటి శుద్దికరణ కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం విస్తరిస్తున్న వ్యాధులను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛమైన నీటిని తాగాలన్నారు. ప్రజలకు స్వచ్ఛ నీటిని అందించాలన్న సంకల్పంతో 43 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారబించారని, ప్రస్తుతం ఆ నీటిని ప్రతి గ్రామంలో సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.

చక్కటి నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థులను అభినందించారు. మూడు తాండల ప్రజలు ఏక తాటిపై ఉండి స్కూల్ తండాలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. పాఠశాల అదనపు గదుల కోసం వచ్చే నిధుల నుంచి కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ తండా, బట్టు తండా, జగదాంబ తండా, రెడ్డిపేట్ సర్పంచులు సలావత్ లలిత బుచ్చిరెడ్డి, రాతుల రెడ్యా నాయక్, రాజు నాయక్, గణిబు సునంద ప్రభాకర్ రావు, మాచారెడ్డి, రామారెడ్డి ఎంపీపీలు నర్సింగ రావు, దశరత్ రెడ్డి, రామారెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, పాఠశాల ప్రదనోపాధ్యాయులు శ్రీనివాస్, మూడు తాండల ప్రజలు పాల్గొన్నారు

Related posts

మాటతప్పి, మడమ తిప్పేసిన సీఎం జగన్

Satyam NEWS

హిందువుల ధర్మానికి చిహ్నం అయోధ్య రామమందిరం

Satyam NEWS

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టిక్కెట్లు పంపిణీ

Satyam NEWS

Leave a Comment