ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను ఆర్థిక మంత్రిని చేస్తే దేశ గతిని మారుస్తానని అంటున్నారు బిజెపి ఎంపి సుబ్రహ్మణియ స్వామి. ప్రస్తుత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కావాల్సినంత విషయ పరిజ్ఞానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నైలో జరిగిన ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ’థింక్‌డ్యూ కాన్క్లేవ్ 8 వ ఎడిషన్‌లో మాట్లాడుతూ స్వామి సీతారామన్‌ను విమర్శించారు.
ఎకనామిక్స్ ఒక స్థూల విషయం, ఇక్కడ ఒక రంగం ఇతర రంగాల ప్రభావంపై ప్రభావం చూపుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఈ వయసులో JNU కి వెళ్లలేరు. ఏదైనా కొత్త విషయం నేర్చుకోలేరు అంటూ విమర్శలు గుప్పించారు. నన్ను ఆర్ధిక మంత్రిని చేసి కొత్త ప్రయోగాలు చేయమని మోదీకి చెప్పండి అని ఆయన ఆహుతులను కోరారు.
1972 నుండి మోదీ తనకు తెలుసునని, ఇద్దరం ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా ఉన్నామని స్వామి అన్నారు. “కానీ నా సమస్య ఏమిటంటే నేను ఆర్థికవేత్త మాత్రమే కాదు, నేను రాజకీయ నాయకుడిని కూడా. నేను ఆర్థిక మంత్రిత్వ శాఖను పొందగలిగితే, నేను భయపడకుండా అన్ని విషయాలూ ప్రజలకు చెప్పగలను అని స్వామి అన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సమస్యల్లో ఉందని, దీనికి మొదటి ప్రాధాన్యత రావాలని ఆయన అన్నారు.