28.7 C
Hyderabad
April 26, 2024 08: 12 AM
Slider ప్రత్యేకం

ఎలక్షన్ ఫీవర్: అధినాయకుడికి ఇంత ఆందోళన ఎందుకో?

distrubed KCR

మునిసిపల్ ఎన్నికల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళనగా ఉన్నారా? మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన ఆందోళనగా ఉన్నట్లు పలు సందర్భాలలో వ్యక్తం అయింది. పట్టణ ప్రాంతాలలో జరుగుతున్న ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందన్న అంచనాలు ఆయనను కలవర పరుస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

లోక్ సభ ఎన్నికలలో నాలుగు స్థానాలు సాధించిన బిజెపి ఆ తర్వాతి కాలంలో ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా కూడా పట్టణ ప్రాంతాలలో అనూహ్యంగా బలం పుంజుకున్నదనే అంచనాలు ఉన్నాయి. అదే విధంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు బిజపికి కలిసి వచ్చే విధంగా ఉన్నాయని కూడా వివిధ సర్వేలలో తేలింది. టిఆర్ఎస్ పార్టీ మజ్లీస్ పార్టీతో కలిసి ఉండటం బిజెపికి కలిసి వస్తున్న విషయం.

పౌరసత్వ చట్టం సవరణపై మజ్లీస్ పార్టీ చేస్తున్న ఆందోళనల విషయంలో మెజారిటీ ప్రజలు వ్యతిరేక భావనలు కలిగి ఉన్నారు. ఈ వ్యతిరేక భావనలు టిఆర్ఎస్ పై రాజకీయంగా ప్రభావం చూసించే అవకాశం కనిపిస్తున్నది. మజ్లీస్ పార్టీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో సిఏఏ సంబంధిత అంశాలపై ర్యాలీలు నిర్వహించింది. ఇదంతా టిఆర్ఎస్ పై ప్రభావం చూపిస్తున్నది.

సరైన అభ్యర్ధులు లేకపోయినా ఈ సారి బిజెపికి ఓటు వేసేందుకు పట్టణ ప్రాంత ప్రజలు నిర్ణయించుకున్నారనే విషయం టిఆర్ఎస్ అగ్ర నేతలకు స్పష్టమైందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉహించని దానికన్నా వెనుక బడటం కూడా టిఆర్ఎస్ కు విపరీతంగా నష్టం కలిగించబోతున్నట్లు వెల్లడి అవుతున్నది.

కాంగ్రెస్ దీటైన పోటీ ఇస్తే త్రిముఖ పోటీలో టిఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే అలా జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత ఘోరంగా తయారవుతున్నది. ఈ రెండు అంశాలతో బాటు టిఆర్ఎస్ పార్టీలో చెలరేగుతున్న అసంతృప్తి జ్వాలలు పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. చాలా ప్రాంతాలలో టిఆర్ఎస్ శ్రేణులు రెండు మూడు వర్గాలుగా చీలి ఉన్నాయి.

మునిసిపాలిటీలు గెలిపించని మంత్రులకు పదవులు ఊడతాయని సిఎం కేసీఆర్ స్పష్టం చేయడం మరిన్ని దారుణాలకు తెరతీసింది. ఉన్న మంత్రిని ఓడిస్తే తమ నాయకుడికి మంత్రిగా అవకాశం వస్తుందనే విధంగా టిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు పని చేస్తున్నారు.

ఈ కారణాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మింగుడు పడటం లేదు. అందుకే ఆయన మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై ఆందోళనగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికలు, ఆ తర్వాత పంచాయితీ ఎన్నికలు ముగిశాయి. మునిసిపల్ ఎన్నికల తర్వాత మరో నాలుగేళ్ల పాటు ఏ ఎన్నికా ఉండదు. తెలంగాణ లో ఈ దఫాకు ఆఖరి రౌండ్ గా జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ గెలిస్తే ఈ నాలుగేళ్లూ మరే ఇతర ఆటంకం లేకుండా కేసీఆర్ రాజకీయంగా అనుకున్న అన్ని విషయాలనూ చేసుకోగలుగుతారు. అదే మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ దెబ్బ తింటే కేసీఆర్ రాజకీయంగా తీసుకోబోతున్న నిర్ణయాలు వాయిదా వేసుకోక తప్పదు.

Related posts

ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

Satyam NEWS

ప్రతి నిరుపేదను ఆదుకొని ఆర్ధిక సహాయం అందించాలి

Satyam NEWS

నిబంధనలకు తూట్లు: గణతంత్ర వేళ బార్లు బార్లా..

Bhavani

Leave a Comment