36.2 C
Hyderabad
May 10, 2024 18: 52 PM
Slider హైదరాబాద్

గ‌బ్బ‌ర్‌సింగ్‌ను విస్మ‌రించి వెనుకంజ‌లో పార్టీలు‌!!!

pawan3

రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం కానీ ఘోర ప‌రాజ‌యాలు.. గెలుపు మ‌న చేతిలోనే ఉన్నాఆయా అంశాల‌ను విస్మ‌రించి చేజేతులారా గెలుపోట‌ముల‌కు కార‌కులుగా నిల‌వ‌డం తీరా గెలుపోట‌ముల అనంత‌రం చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఆ దిశ‌లో అడుగులు వేస్తే బాగుండేమో అనుకోవ‌డం స‌హ‌జం.. ఇది మాన‌వాళి నైజం కూడా అని ప‌లుమార్లు నిరూపిత‌మైంది. ఆయా విస్మ‌రించిన అంశాలే కొన్నిసార్లు పార్టీల గెలుపోట‌ముల‌పై తీవ్ర ప్ర‌భావాన్నిచూపుతాయ‌న‌డానికే ఈ క‌థ‌నం చ‌దివితే మీకే అర్థ‌మ‌వుతుంది.

ఇక విష‌యాల్లోకి వెళితే..

గ‌త జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో నాలుగు సీట్లు ఉన్న క‌మ‌లం కాస్త 48 సీట్ల‌కు విస్త‌రించింది. అధికార పార్టీ 99 ఉండ‌గా ప్ర‌స్తుతం 56తో స‌రిపెట్టుకుంది. కానీ ఇరువురి బ‌లాబ‌లాలు, సెంటిమెంట్లు, ఆర్థిక‌, అంగ బ‌లాలు, మైండ్‌గేమ్‌లు, ప్ర‌చారాలు, ఎత్తుకు పై ఎత్తులు ఆయా పార్టీల గెలుపోట‌ముల‌ను నిర్ధేశించిన‌ప్ప‌టికీ ఇక్క‌డ చెప్పుకోవాల్సిన అంశం మ‌రోటి ఉంది. అన్ని పార్టీలు కూడా ఆ అంశాన్ని విస్మ‌రించాయ‌నే చెప్పొచ్చు. ఎమో గుర్రం ఎగ‌రా? వ‌చ్చేమో అన్న చందంగా ఉంటుందీ ఈ సూక్ష్మ‌మైన అంశం. కానీ ఆలోచిస్తే మాత్రం అది స‌రైదేన‌ని అంద‌రూ ఒప్పుకొని తీరాల్సిందే..

ప్రేక్షాకాభిమానం అంటే త‌క్కువేం కాదు!

స‌రే.. అప్ప‌ట్లో రాజ‌కీయాల్లో ఒక ఊపు ఊపి తెలుగువారంద‌రినీ ఏక‌తాటిపైకి తెచ్చి మ‌హోగ్ర‌రూపం దాల్చి కాంగ్రెస్ పార్టీ అనే దిగ్గ‌జాన్ని ఓంటిచేత్తో మ‌ట్టిక‌రిపించిన మ‌హానుభావుడు ఎన్టీఆర్ అని ఇందులో ఎలాంటి సందేహం లేద‌ని అంద‌రికీ తెలిసిందే. ఇక త‌మిళ‌నాట జ‌య‌ల‌లిత‌, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సినీ యాక్ట‌ర్లు రాజ‌కీయంలో పూర్తి ప‌రిణితి సాధించార‌నే చెప్పుకోవ‌చ్చు. అదంతా ఎందుకు గ‌తంలో మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి కూడా ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి 18 ఎమ్మెల్యే సీట్ల‌ను కైవ‌సం చేసుకోవ‌డం కూడా అంద‌రికీ తెలిసిందే. త‌ద‌నంత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ విలీనం, రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌డం, ఆయ‌న వార‌సుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన రాజ‌కీయ అరంగేట్రం తెలిసిన విష‌యాలే. ఇక నిన్న గాక మొన్న ఉత్త‌రాది న‌టి ఊర్మిళా మాతోడ్క‌ర్‌ను సైతం శివ‌సేన అక్కున చేర్చుకొని ఎమ్మెల్సీ ఆఫ‌ర్ ఇవ్వ‌డం కూడా తెలిసిందే. అంటే రాజ‌కీయాల్లో ఏ చిన్న‌ అంశాన్ని విస్మ‌రించ‌కూడ‌ద‌నేది ఇక్క‌డ నేర్చుకోవాల్సిన గుణ‌పాఠం. గ‌బ్బ‌ర్‌సింగ్‌ను విస్మ‌రించి గెలుపోట‌ముల అవ‌కాశాల‌ను ఆయా పార్టీలు చేజేతులా జార విడుచుకున్నాయ‌నే చెప్పొచ్చు.

ప్రేక్ష‌కుల మ‌దిలో విశేష స్థానం ఆయ‌న‌ది

ఇక్క‌డ చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే.. భార‌తీయ జ‌న‌తాపార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ర్ట స‌మితి (టీఆర్ఎస్‌), కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పార్టీలు న‌టుడిగా రాణిస్తున్నరాజ‌కీయాల్లోని కొన్ని ఓట్లు ఎందుకు కాదు.. వాటితోనే గెలుపోట‌ముల‌ను నిర్ధేశించే స్థాయిలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను విస్మ‌రించ‌డం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్ల ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, ఇటు తెలంగాణ‌లోనూ అభిమానం, ఆద‌ర‌ణ ఉంటాయ‌నేది ఈ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా కాకున్నాసూక్ష్మంగా ఆలోచించే వారికెవ్వ‌రికైనా ఇట్టే అర్థ‌మైపోతుంది.

బ‌ద్రీ ప్ర‌చారంతో ఫ‌లితాల్లో మార్పు?!

ఒక‌వేళ పైన చెప్పుకున్న పార్టీల్లో ఏ పార్టీయైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేత కొద్దో గొప్పో ప్ర‌చారం నిర్వ‌హిస్తే ఫ‌లితాల విశ్లేష‌ణ నేడు చెప్పుకున్న‌ట్లుగా కాకుండా మ‌రోలా ఉండేద‌ని ఆయ‌న అభిమానులు, సినీ ప్రేక్ష‌కులే కాదు.. రాజ‌కీయాల్లో దిగ్గ‌జ నేత‌లు, విశ్లేష‌కులు కూడా అనుకుంటూండ‌డం విశేషం.

బంగారాన్నివిస్మ‌రించిన బీజేపీ!!!

స‌రే బీజేపీ పార్టీ కోసం తెలంగాణ‌లో తాను జ‌న‌సేన త‌ర‌ఫున‌ పోటీ చేస్తున్న 30 స్థానాల‌ను త్రుణ‌ప్రాయంగా ప‌వ‌న్ ఎలాంటి ష‌ర‌తులు లేకుండా వ‌దులుకున్నారు. ఈ విష‌యాన్నే క‌మ‌ల‌ద‌ళం ( ఇక్క‌డ కేవ‌లం బీజేపీ అనే కాదు.. మిగ‌తా ఏ పార్టీలైనా) మ‌రిచి ఒంటిచేత్తో పార్టీని గెలిపించుకుంటామ‌నే ధీమాతో ముందుకు వెళ్ళిన‌ప్ప‌టికీ ఒక వైపు సీమాంధ్రులున్న బెల్ట్ మొత్తం ఆయా పార్టీల చేతుల్లోనుంచి విడుచుకున్నారే చెప్పొచ్చు. సినీ అభిమానం రాజ‌కీయాల్లో తీవ్ర ప్ర‌భావాన్నే చూపుతోంద‌ని నిన్న‌టి జీహెచ్ఎంసీ ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే అర్థ‌మ‌వుతోంది. కానీ బీజేపీ కోసం 30 స్థానాల్లో పోటీలోనుంచి త‌ప్పుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కాస్త బీజేపీ మ‌రిచిపోవ‌డం ఆక్షేప‌ణీయ‌మ‌నే చెప్పాలి. ప్రేక్ష‌కాభిమానం మెండుగా ఉన్న బంగారాన్ని వ‌దులుకోవ‌డం ఆయా రాజ‌కీయ పార్టీల ద‌శ దిశ‌నే మార్చింద‌ని చెప్పొచ్చు. ఒక్క‌మారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారం గ‌నుక చేసిన‌ట్ల‌యితే ఆ పార్టీకి వ‌చ్చే న‌ష్టం ఏం ఉండేది కాదు.. పైగా గెలుపు ముంగిట వాలే అవ‌కాశాన్ని త‌న చేజేతులా వ‌దిలేసుకున్న‌ట్లు లేదా ఈ మాత్రం ప్ర‌చార‌మే చాల‌నుకున్న‌ట్లు, రాజ‌కీయంగా వారిని ఉప‌యోగించుకోక‌పోవ‌డంతో (లేదా ఇత‌ర పార్టీల‌కో) మ‌రింత లాభం చేకూరే మార్గాన్ని జార విడుచుకున్న‌ట్ల‌యింద‌నే? అనే మీ మాంస అంద‌రిలోనూ ఉండ‌డం విశేషం.

అందుకే అంటారు పెద్ద‌లు.. ఎవ్వ‌రినీ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడ‌ద‌ని.

Related posts

ఒంటిగంట తర్వాత రోడ్లపై ఏ ఒక్కరూ సంచరించొద్దు…!

Satyam NEWS

మళ్లీ తల్లి కాబోతున్న కరీనా కపూర్

Satyam NEWS

Side Effects Of Having High Cholesterol

Bhavani

Leave a Comment