ఐఐటీ జేఈఈ ఫోరమ్ ఆధ్వర్యంలో లో 2014-2019ఆరు సంవత్సరాల జేఈఈ(advanced) విశ్లేషణ సమాచార పుస్తకాన్ని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి విశ్వం విద్యా సంస్థ లో మంగళవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం ఐఐటీ ఔత్సాహికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియచేసారు.
ఈ పుస్తక సమాచార సేకరణ, వ్యాసకర్త కె.లలిత్ కుమార్ విశ్లేషణ వివరించిన తీరు ఆసక్తికరంగా ఉందన్నారు. విద్యార్థుల ర్యాంకులు, సీట్లు కేటాయింపు, కట్ ఆఫ్ మార్కులు, తదితర సమాచారాన్ని అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వం విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్.విశ్వ నాథ్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వ చందన్ రెడ్డి, ద్రవిడియన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ఓ.వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.