Slider మెదక్

లాక్ డౌన్ జర్నలిస్టు పాస్ తో దొంగ సారా వ్యాపారం

#Illegal Arrack

కరోనా సమయంలో జర్నలిస్టులంతా ప్రాణాలకు తెగించి ఫీల్డ్ లో తిరిగి వార్తలు పంపుతుంటే ఈ రిపోర్టర్ మాత్రం సారా దందాలో మునిగిపోయాడు. కరోనా లాక్ డౌన్ లో వార్తలు కవర్ చేసేందుకు పోలీసులు తనకు ఇచ్చిన పాస్ ను సారా దందా చేసే తన పార్టనర్ లకు ఇచ్చేశాడు.

ఆ విలేకరి అండతో దొంగసారా సరఫరా చేస్తూ ఇద్దరు దొరికి పోయారు. విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. ఈ తతంగం అంతా దుబ్బాకలో జరిగింది. దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్ ఆదేశానుసారం కానిస్టేబుళ్లు రాజిరెడ్డి, శ్రీనివాస్ దుబ్బాక మండలంలో పోతారం గ్రామ శివారులో పెట్రోలింగ్ చేస్తున్నారు. నేటి ఉదయం 10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు TS36E-4428 నెంబరు మోటారు సైకిల్ పై వస్తుండగా అనుమానం వచ్చి వారి ఆపి విచారించారు.

వాళ్లిద్దరూ తమ పేర్లు చందపట్ల భాను ప్రసాద్, కైరం కొండ బాలరాజ్ అని పోలీసులకు చెప్పారు. వారి వద్ద ఉన్న  బ్యాగు తనిఖీ చేయగా బ్యాగులో నాటు సారాయి 1/2  లీటర్ 15 ప్యాకెట్లు,  7.1/2 లీటర్లు  సారాయి ఉంది. సారాను  స్వాధీనం చేసుకొని వారిని పోలీసులు తమ దైన శైలిలో విచారించారు.

ఎక్కడి నుండి వస్తున్నారు? ఎక్కడకు వెళుతున్నారు అని ప్రశ్నించారు. దాంతో వారు దుబ్బాక మనం పేపర్ రిపోర్టర్ కిష్టంగారి కిష్టారెడ్డి పాస్ విషయం బయటకు వచ్చింది. లాక్ డౌన్ సందర్భంగా తనకిచ్చిన విలేఖరి పాస్ ను వీరిద్దరికి అతను ఇచ్చేశాడు. ముగ్గురూ కలిసి సారా దందా చేస్తున్నట్లు చెప్పారు.

ఈరోజు ఉదయం కామారెడ్డి జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామం వెళ్లి, అక్కడ తక్కువ రేటుకు సారా తీసుకొని వచ్చి దుబ్బాక పట్టణంలో ఎక్కువ రేటు అమ్ముతుంటారు. వారు చెప్పింది విని షాక్ తిన్న పోలీసులు విలేకరి పాస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్నీ అరెస్టు చేశారు.

ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దుబ్బాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా మనం పత్రిక విలేఖరి కిష్టారెడ్డి తనకు ఇచ్చిన పాసును  దుర్వినియోగం చేసి ఇతరులకు అప్పగించాడని తెలిపారు. ఆ పాస్ చూపించుకుంటూ  సారా తీసుకుని దందా చేస్తుంటారని ఆయన అన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఇచ్చిన పాసులు దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts

నిత్యావసర ధరల పెరుగుదల ఆపలేకపోయిన సీఎం జగన్

Satyam NEWS

ఘనంగా చర్లపల్లి పాస్టర్ ఫెలోషిప్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

mamatha

Sale Diabetes Cures Home Remedies Herb For Blood Sugar How To Get Sugar Levels Down Fast

mamatha

Leave a Comment