27.7 C
Hyderabad
May 14, 2024 04: 04 AM
Slider ప్రపంచం

భారత్ తో మంచి సంబంధాలు పెట్టుకోవడం లాభమే కానీ…

#imrankhan

భారత్ తో సత్ సంబంధాలు పెంచుకోవడం అంటే కాశ్మీరీలకు అన్యాయం చేసినట్లేనని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ ప్రజలను పాకిస్తాన్ కు దూరం చేసిన భారత్ తో ఇప్పటిలో సత్ సంబంధాలు పెంచుకోవడం సాధ్యం అయ్యే పని కాదని ఆయన అన్నారు.

అయితే భారత్ తో మంచి సంబంధాలు పెట్టుకోవడం వల్ల కొన్ని మంచి ఫలితాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. భారత్ తో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలు ఎన్నో లాభాలు పొందుతున్నాయని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

తాను పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇవే విషయాలు చెబుతున్నానని ఆయన అన్నారు. కాశ్మీర్ అంశంపై చర్చలు జరిపితే భారత్ తో మంచి సంబంధాలు పెంచుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తో సంబంధాలు పెంపొందించుకోవడం కాశ్మీరీలకు ద్రోహం చేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ తో మంచి సంబంధాలు పెట్టుకోవడం వల్ల లక్ష మంది కాశ్మీరీల త్యాగం వృధా అవుతుందని ఆయన అన్నారు.

Related posts

విజయనగరం పోలీసులకు ఫిట్ నెస్ జిమ్ ప్రారంభం

Satyam NEWS

ఆర్ధిక ఉన్మాదుడు పొంగులేటి

Bhavani

మాఫియాల రాజ్యంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

Satyam NEWS

Leave a Comment