32.7 C
Hyderabad
April 27, 2024 00: 30 AM
Slider విజయనగరం

విజయనగరం పోలీసులకు ఫిట్ నెస్ జిమ్ ప్రారంభం

#vijayanagaram police

విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారి ఒకేసారి ఒకే ప్రాంగ‌ణంలో మూడు కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. ఇవి జిల్లా పోలీస్ కార్యాల‌యంలో సిబ్బంది సంక్షేమానికి సంబంధించినవి  కార్య‌క్ర‌మాలు. ఒక‌టి హోం గార్డుల విశ్రాంతి గ‌ది, రెండు సిబ్బంది ఫిట్ నెస్ సంబంధించి జీమ్, మూడు ఆర్మీడ్  రిజ‌ర్వు సిబ్బంది విశ్రాంతి తీసుకునే హాలు.

వీటిని పోలీస్ కార్యాల‌యంలో ఎస్సీ సంప్ర‌దాయ బ‌ద్దంగా కొబ్బ‌రి కాయ కొట్టి  ప్రారంభించారు. ఈ మూడింటికి ఖర్చు ఎంత అయ్యింద‌ని మీడియా ప్ర‌శ్నిస్తే……అంతా సిబ్బంది శ్ర‌మ‌దాన‌మేన‌ని  చెప్ప‌డం..గొప్ప విష‌యం.

తొలుత డీపీఓ ఆర్మ్ డ్ రిజ‌ర్వు ఆఫీసు పక్క‌న పోలీస్ పెట్రోల్, క్లూస్ టీం వాహ‌నాలు పార్క్ చేసే స్థ‌లంపై భాగం ఫ‌స్ట్ ఫ్లోర్ లో సిబ్బంది వ్యాయాయం చేసుకునేందుకు జిమ్, అదే విదఃగా ఆ ప‌క్క‌నే హోం గార్డుల రెస్ట్ రూమ్..ఆ తర్వాత దిగువ‌న క్యాంటీన్ వెనుక భాగానే ఆర్మ్ డ్ సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు పెద్ద హాలును ఎస్పీ ప్రారంభించారు.

ముందుగా అటు ఆర్మ‌డ్ సిబ్బంది ,ఇటు ఎస్టీఎఫ్ స్టాప్  గాడ్ ఆఫ్ ఆన్ తో సెల్యూట్ చేసారు. అనంత‌రం పైన జిమ్  రూమ్ ను ప్రారంభించి… గ‌దిలో  వ్యాయామం చేసే ప‌రిక‌రాల‌ను ఎస్పీ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా  ఓ ప‌రిక‌రాన్ని ఎస్పీ స్వ‌యంగా ప‌రిశీలించారు.

అలాగే ఆప‌రేష‌న్ ఆఫ్ స్పెష‌ల్ డ్యూటీ(ఓఎస్డీ) ఏఎస్పీ సూర్య‌చంద్ర‌రావు కూడా  ఓ వ్యాయామ ప‌రిక‌రాన్ని స్వ‌యంగా పరిశీలించారు. ఈ సంద‌ర్బంగా ఓ నాలుగు ఎక్స‌ర్సైజ్ కూడా చేసారు. ఆ ప‌క్క‌నే నిర్మించిన ఓ 50 మంది హోం గార్డులు  ఓకేసారి  సేద తీరేందుకుగాను నిర్మించిన విశ్రాంతి గ‌దిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆర్మీ వెల్ఫ‌రే సిబ్బందిని..స‌దుపాయాలు గురించి ఎస్పీ ప్ర‌శ్నించారు. అక్క‌డ నుంచీ క్యాంటీన్ వెన‌కాలే దాదాపు  ల‌క్ష రూపాయ‌ల ఖర్చుతో ఆర్మ్ డ్ సిబ్బందికి విశ్రాంతి తీసుకునే పెద్ద హాలును ఎస్పీ తో స‌హా ఏఎస్పీలు ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎస్పీ మీడియా తో  మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమం దృష్ట్యా  ఈ మూడు  నిర్మించామ‌న్నారు. పోలీస్ అంటే 24 గంట‌ల  ఉద్యోగ‌మ‌ని..ఏ పూట‌, తింటారో…ఏ పూట ప‌ని చేస్తేరో తెలియ‌ని ప‌రస్థితి ఉంద‌ని అలాగే ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారో కూడా తెలియద‌ని ఈ నేప‌ధ్యంలో  విధులు నిర్వ‌హించి తిరిగి ఇంటికి వెళ్లేందుకు స‌మ‌యం ఉండ‌ద‌ని ఆ ఉద్దేశ్యంతో నే ఈ మూడు  వ‌స‌తులు నిర్మించామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు ఏఎస్పీలైన  స‌త్య‌నారాయ‌ణ‌, సూర్య‌చంద్ర‌రావుల‌తో పాటు  ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, లా అండ్ ఆర్డ‌ర్ డీఎస్పీ త్రినాథ్, ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు, ఎస్బీ సీఐలు శ్రీనివాస‌రావు, రాంబాబుల‌తో పాటు  ఆర్మ్ డ్  ఏఓ చిరంజీవి, పీఆర్ఓ కోటేశ్వ‌ర‌రావు, ఇత‌ర  సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పి వి ‘‘కాలాతీతుడు’’ కవులకు 8న రవీంద్ర భారతిలో సత్కారం

Satyam NEWS

Free|Sample Penius Pills

Bhavani

ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

Bhavani

Leave a Comment