30.7 C
Hyderabad
May 5, 2024 05: 12 AM
Slider ప్రపంచం

రిపబ్లిక్ డే వేడుకలకు ఐదు ఆసియా దేశాలకు ఆహ్వానం

2022 గణతంత్ర దినోత్సవం వేడుకలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రిపబ్లిక్ వేడుకలు ఇంకా నెల రోజులు ఉండగా షెడ్యూల్ ఖరారు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆఫ్ఘన్ లో ఉగ్ర ప్రభుత్వం ఏర్పడటంతో మన దేశం మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. ఐదు ఆసియా దేశాలకు భారతదేశ ఆహ్వానం పంపింది.

న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ హాజరు కావాల్సిందిగా ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్ , తజికిస్థాన్ దేశాధినేతలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. ఇదే విషయంపై అధికారులు స్పందిస్తూ.. “దేశాధినేతలకు అధికారిక ఆహ్వానాలు పంపించామని.. వారి నుంచి సమాధానం రావాల్సి ఉందని చెప్పారు.

2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. PM నరేంద్ర మోడీ 2015లో మొత్తం ఐదు మధ్య ఆసియా దేశాలను సందర్శించారు. 2022 రిపబ్లిక్ డే ఈవెంట్‌కు సెంట్రల్ ఆసియా నాయకులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించాలనే నిర్ణయం భారతదేశ మధ్య ఆసియా విధానానికి చాలా అనుగుణంగా ఉంది.

Related posts

సి పి ఎస్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్

Satyam NEWS

ఉప్పల్ కాంగ్రెస్ నాయకులకు పదవీ బాధ్యతలు

Satyam NEWS

కెమెరా యాక్షన్: చిరంజీవి, నాగార్జులతో మళ్లీ మంత్రి సమావేశం

Satyam NEWS

Leave a Comment