ఇండోనేషియా లోని తూర్పు తీర ప్రాంతమైన పాపువాలో ఆదివారం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలియచేస్తున్న సమాచారం ప్రకారం సునామీ హెచ్చరిక లే కుండానే ప్రాంతీయ రాజధాని జయపుర నుండి 158 కిలోమీటర్ల (98 మైళ్ళు) లోతట్టులోని సముద్ర ప్రాంత ద్వీపం వద్ద దాదాపు 34 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.
ఆగ్నేయాసియా ద్వీపసమూహం భూమిపై అత్యంత విపత్తు సంభవించే దేశాలలో ఇండోనేసియా ఒకటని, 2018 లో, సులవేసి ద్వీపంలోని పలులో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం మరియు ఆ తరువాత వచ్చిన సునామీ కారణంగా 4,300 మందికి పైగా చనిపోయింట్లు యుఎస్జిఎస్ తెలిపింది.కాగా నేటి బూకంపతో జరిగిన ఆస్తినష్టం ప్రాణ నష్టం పై ఇంకా వివారాలు అందాల్సి ఉందని ఆ సంస్థ పేర్కొంది.