Slider నల్గొండ

కృష్ణా నది జలాల అక్రమ వినియోగాన్ని ఏపీ ఆపాలి

#CPM Nalgonda

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడికి వ్యతిరేకంగా ఆయకట్టు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో లో రైతు సంఘం సమావేశం జరిగింది. జిల్లా నాయకులు పులి చింతల వెంకటరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో లో వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు బూచి చూపించి దక్షిణ తెలంగాణ ఎడారిగా చేసే కార్యక్రమం చేపట్టారని ఆంధ్ర పాలకులు పోతిరెడ్డిపాడు తూములు వెడల్పు, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేయటానికి సమాయత్తమవుతున్నారని అన్నారు.

వీటిని తెలంగాణ రైతాంగం ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేయకపోతే దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారుతుందని, అందుకే వీటిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిరక్షణ కమిటీ కన్వీనర్ మేకల నాగేశ్వరరావు, ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్న గౌడ్ ,సి పి ఐ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు కాకి అజయ్ పాల్గొన్నారు.

ఇంకా సిపిఐ జిల్లా నాయకులు వాసుదేవరావు ,సిపిఎం జిల్లా నాయకులు ములకలపల్లి సీతయ్య, టిడిపి జిల్లా నాయకులు జగన్ ,బిజెపి జిల్లా నాయకులు ముసుకుల చంద్రారెడ్డి ,స్థానిక కౌన్సిలర్లు ములకలపల్లి రామ గోపి,త్రివేణి ,వెంకటేష్ ,కస్తాల శ్రవణ్ కుమార్ ,పాశం వీరబాబు ,మామిడి నరసయ్య ,సైదులు, తురక సైదులు పాల్గొన్నారు.

Related posts

తిరుపతిలో ఉదయం పక్షపత్రిక నాలుగవ వార్షికోత్సవం

Satyam NEWS

పింఛన్‌ డబ్బులు పంచకుండా ప్రియురాలితో పరారైన వాలంటీర్‌

Satyam NEWS

కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment