28.7 C
Hyderabad
May 6, 2024 08: 30 AM
Slider ముఖ్యంశాలు

దళిత బంధు మాకొద్దు 3 ఎకరాల భూమి ఇవ్వండి…

#dkmadiga

దళిత బంధు పథకం అమలులో విఫలం అయినందున ముందు చెప్పినట్టు సీఎం కేసీఆర్ ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని తెలంగాణ మాదిగ దండోరా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు డికే.మాదిగ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సామాజిక వర్గం,జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే 18 లక్షలు జనాభా ఉన్నారు. మాల సామాజిక వర్గం 15 లక్షలు జనాభా ఉన్నారు. దళిత బంధు పథకం,విడతలవారీగా ఇచ్చినా ఆ పథకం అర్హులైన, మాల మాదిగ సోదరులకు అందడం లేదని డికే.మాదిగ అన్నారు.

దళిత బంధు పథకం ఇచ్చే దాని కంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు దళితులకు ఇస్తానని చెప్పిన, 3 ఎకరాల భూమి ఇవ్వాలని, ఆ భూమి ఇస్తే బడుగు బలహీన వర్గాల దళిత జాతి ప్రజలు,అభూమిని సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారనీ తెలిపారు. అదేవిధంగా ప్రతీ నియోజకవర్గంలో అర్హులైన మాల మాదిగ సోదరుల కు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని,డికే.మాదిగ ముఖ్యమంత్రి ని కోరారు.

దళితుల క్షేమం కోరి, ప్రవేశపెట్టిన ఏ పథకాలు పేదలకు అందడం లేదని,ఆ పథకాలను పక్కదోవ పట్టిస్తున్నారని డికే.మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకొరకే,తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళిత బంధు పథకం పక్కనపెట్టి, బడుగు బలహీనవర్గాల మాల మాదిగ సోదరులకు 3 ఎకరాల భూమి, ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రకంగానైనా దళితులకు మేలు చేసినట్లవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా నాయకులు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి

Satyam NEWS

ఉత్తరాఖండ్ లో తల్లీ కూతురిపై సామూహిక అత్యాచారం

Satyam NEWS

“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం లో మంత్రి ఆర్కే రోజా

Satyam NEWS

Leave a Comment