31.7 C
Hyderabad
May 2, 2024 07: 04 AM
Slider ముఖ్యంశాలు

“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం లో మంత్రి ఆర్కే రోజా

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం టీసీ అగ్రహారం సచివాలయం పరిధి కల్లూరు పంచాయతీ లో నేడు మంత్రి ఆర్కే రోజా “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా, మండల స్థాయి అధికారులతో కలసి గడప గడప కు వెళ్లి వారికి ఈ ప్రభుత్వం లో గత 3 సంవత్సరాల నుంచి అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను, వారు వారికుతుంబాల వారీగా పొందిన లబ్ది ను సవివరంగా వివరించారు.

వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ భరోసా, వైఎస్ఆర్ చేదోడు, అమ్మ వడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సున్న వడ్డీ రుణాలు, రైతు భరోసా పథకాలు, ఆరోగ్య శ్రీ సేవలు, పేదలందరికీ ఇల్లు, జలయజ్ఞం, మన బడి నాడు నేడు, వైయస్సార్ కంటి వెలుగు, వైయస్సార్ బీమా, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్సార్ కళ్యాణ కానుక, వైయస్సార్ చేయూత మొదలైన పథకాల ద్వారా మరియు ఎన్నో సబ్సిడీ స్కీములు ద్వారా ప్రజలకు జగనన్న ఈ ప్రభుత్వం లో చేయాలనుకున్న మంచి ఆయన కృషి నీ ప్రజల్లోకి విస్తృతం గా తీసుకెళ్లారు.

గత ప్రభుత్వం లో అధికారం కోసం పథకాలు ప్రవేశపెట్టి ఇచ్చిన హామీలను తుంగ లో తొక్కారని, కానీ జగనన్న ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని, ఈ పథకాలను అమలుపరిచారని తెలిపారు.

కరోనా మహమ్మారి, గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన అప్పులు, ప్రకృతి బీభత్సాన్ని సైతం తట్టుకొని ప్రజలకు మేలు చేస్తున్న జగన్ అన్న మంచి మనసు దూరదృష్టి మరెవ్వరికీ లేదని కితాబిచ్చారు.

Related posts

తనను తాను తీర్చిదిద్దుకున్న ఏవీఎస్ ప్రదీప్

Satyam NEWS

థెరపీ:బ్రెయిన్‌ సర్జరీ చేస్తుంటే వయొలిన్‌ వాయించి

Satyam NEWS

గౌడ్ లు రాజ్యాధికారం దిశగా కృషి చేయాలి

Satyam NEWS

Leave a Comment