28.7 C
Hyderabad
May 6, 2024 10: 04 AM
Slider ప్రత్యేకం

హెల్త్ కేర్ లీడ‌ర్ క్లిమామ్ కు అంత‌ర్జాతీయ పుర‌స్కారం

health

హైద‌రాబాద్ కేంద్రంగా గ‌త ఐదేండ్లుగా వెల్ నెస్ అండ్ ఫార్మ్స్ రంగంలో సేవ‌లందిస్తున్న‌ క్లిమామ్ కు అంత‌ర్జాతీయంగా అరుదైన గౌర‌వం ల‌భించింది. బుధ‌వారం దుబాయ్ లో  జరిగిన International Forum on Advancements in Healthcare కార్యక్రమంలో క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. 

హెల్త్ కేర్ లీడర్ క్యాట‌గిరి లో అమెరికా,ర‌ష్యా, బ్రిట‌న్ పాటు వివిధ దేశాలు పోటీ ప‌డ‌గా  క్లిమామ్ వెల్ నెస్ అండ్ ఫార్మ్స్ కు టాప్ 100 లో  చోటు ద‌క్కింది. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో విశేష‌మైన కృషి చేసినందుకు ఈ అవార్డు ద‌క్కింది.  వెల్ నెస్ అండ్ ఫార్మ్స్ రంగంలో  సాధించిన  విజయాలకు గానూ క్లిమామ్ కు  గుర్తింపు ల‌భించింది.

గత ఏడాది IFAH కార్యక్ర‌మం అమెరికాలో నిర్వ‌హించ‌గా ఈ సంవ‌త్స‌రం దుబాయ్ లో జ‌రిగింది. ఈ  అవార్డు రావడం ప‌ట్ల అల్లోల దివ్యారెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. క్లిమామ్ కు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావ‌డంతో త‌మ భాద్య‌త మ‌రింత పెరిగింద‌న్నారు.

Related posts

బాలిక అని కూడా చూడకుండా పైశాచికత్వం

Satyam NEWS

అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు అందరూ కృషి చెయ్యాలి

Satyam NEWS

టెన్షన్ రన్:కృష్ణానదిపరీవాహక ప్రాంతంలో భూప్రకంపనలు

Satyam NEWS

Leave a Comment