Slider నిజామాబాద్

గురుకుల పాఠశాల పిన్సిపల్ వార్డెన్ల తొలగింపు

bichkunda

కామారెడ్డి జిల్లా బిచ్కుంద  మండల కేంద్రంలోని మైనార్టీ గురుకులంలో మంగళవారం రాత్రి ఏడు గంటల భోజనం సమయం అనంతరం 35మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రాత్రికిరాత్రే ఎవరికి తెలియకుండా సమాచారాన్ని గోప్యంగా ఉంచి విద్యార్థులకు బాన్స్‌వాడ  ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమితం తరలించడం తీవ్ర దుమారం లేపింది.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు బాన్స్‌వాడ ఆసుపత్రి వద్ద ఆందోళన గురికాగా బుధవారం ఉదయం  జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే పాఠశాలకు వెళ్లి అక్కడున్న విద్యార్థులతో మాట్లాడారు. గత ఇరవై రోజుల క్రితం నలభైఅయిదు మంది విద్యార్థులు  అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎమ్మెల్యే షిండే జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని షబానా పాఠశాలలో విచారణ చేపట్టారు. భోజనం ఏజెన్సీని రద్దు చేయాలంటూ జిల్లా అధికారిని ఆదేశించారు. అనంతరం  ప్రిన్సిపాల్, వార్డెన్లను  సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts

ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు పక్డబందీగా నిర్వహించాలి

Satyam NEWS

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆరో రోజు అన్నదానం

Satyam NEWS

అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే హక్కుపై ‘సుప్రీం’ చారిత్రాత్మక నిర్ణయం

Satyam NEWS

Leave a Comment